టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న హీరో బర్నింగ్ స్టార్ "సంపూర్ణేష్ బాబు". తన మొదటి మూవీ హృదయ కాలేయంతో తెలుగు సినీ ప్రేక్షకులకి సూపర్ కమెడియన్ గా పరియచం అయ్యాడు. ఇదిలా ఉంటే కొంత మంది బడా బాబులు, సంపూర్ణేష్ బాబు ఎదుగుదలకి అడ్డుకట్ట వేస్తున్నారు..., అనే భావన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. కానీ ఓ స్టార్ హీరో మాత్రం సంపూర్ణేష్ బాబుకి తన మూవీలో స్క్రీన్ స్పేస్ ని ఇచ్చి, తనకి ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. మేటర్ లోకి వెళితే, మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమా ఈ శుక్రవారం, అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకుంది. ఈ మూవీ అక్టోబర్ 17న రిలీజ్ కావాలి, కానీ హుదూద్ తుఫాన్ ప్రభావం వల్ల ఈ సినిమాని 31కి వాయిదా వేసారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వర్తపడు వాలిబార్ సంఘం’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో ‘హృదయ కాలేయం’తో బాగా ఫేమస్ అయిన సంపూర్నేష్ బాబు ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. సంపూర్నేష్ బాబు పాత్ర ఉన్నది కొద్ది సేపైనా ఆడియన్స్ ని తెగ నవ్విస్తుందని అంటున్నారు. ‘సంపూర్నేష్ బాబు ట్రాక్ సినిమాలో కొద్దిసేపే ఉంటుంది. కానీ ఉన్నంత సేపూ ఆడియన్స్ ని తెగ నవ్విస్తాడు. కరెంట్ తీగ సినిమాకి సంపూర్నేష్ బాబు ట్రాక్ హైలైట్ అవుతుందని’ మంచు మనోజ్ తెలిపాడు. మంచు మనోజ్, సంపూర్ణేష్ బాబుకి అవకాశం ఇచ్చాడు అనే విషయం తెలుసుకున్న కొందరు, ఈ మూవీలో సంపూర్ణేష్ రోల్ ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడటానికి ఇప్పటి నుండే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అలాగే హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఓ అతిధి పాత్రలో కనిపించనుండడంతో అది ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: