విక్టరీ వెంకటేష్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గోపాల గోపాల. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, తన కాస్ట్యూమర్ కి అంతగా పనులు చెప్పడం లేదంట. ముఖ్యంగా తన కాస్ట్యూమ్స్ కి సంబంధించిన పనులని తనే చూసుకుంటున్నట్టుగా చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం. మేటర్ లోకి వెళితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్. బాలీవుడ్ లో పరేష్ రావాల్ పోషించిన పాత్రని వెంకటేష్ ఇందులో పోషిస్తున్నాడు. పరేష్ రావాల్ మిడిల్ క్లాస్ వ్యక్తిలా చాలా సింపుల్ గా కుర్తా, పైజామా, జాకెట్స్ తో కనిపిస్తారు. తెలుగులో మన నేటివిటీకి తగ్గట్టు ఉండాలని వెంకటేష్ స్పెషల్ కేర్ తీసుకున్నారు. ‘గోపాల గోపాలలో వెంకటేష్ పోషిస్తున్న మిడిల్ క్లాస్ పాత్రకి ఆయనే దగ్గరుండి తన కాస్ట్యూమ్స్ ని సెలక్ట్ చేసుకున్నారు. అందులో భాగంగా షార్ట్ కుర్తాస్ ని సెలెక్ట్ చేసుకోవడం అవి కూడా ఎక్కువ భాగం లెనిన్, కాటన్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అంతే కాకుండా వెంకటేష్ స్వయంగా షాపింగ్ కి వెళ్లి మరి తన డ్రెస్ లను సెలక్ట్ చేసుకున్నారు. వెంకటేష్ తన కాస్ట్యూమ్స్ ని తనే సెలక్ట్ చేసుకోవడం అనేది ఇదే మొదటి సారిగా చెబుతున్నారు. గతంలో తన చిత్రాలకి తనే కాస్ట్యూమ్స్ ని సెలక్ట్ చేసుకున్నాడు కాని, మూవీకి ఫుల్ లెన్త్ లో తన కాస్ట్యూమ్స్ ని సెలక్ట్ చేసుకోవడం అనేది ఇదే మొదటిసారి. వెంకటేష్ సరసన శ్రియ శరన్ నటిస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి వెంకటేష్ కాస్ట్యూమర్ మారి తను నటిస్తున్న గోపాల గోపాల మూవీలో సరికొత్త ట్రెండీ లుక్ తో అభిమానులని అలరించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: