షారూఖ్‌ ఖాన్‌ సినిమా అంటే బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. తను నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమా తర్వాత అతనికి దక్షిణాదిలో క్రేజ్‌తో పాటు మార్కెట్‌ కూడా ఏర్పడింది. ఇదే ఇప్పుడు షారూఖ్‌ తాజా సినిమా హాపీ ఇయర్ కు ఉపయోగపడింది. డైమాండ్‌ కోసం ఆరుగురు దొంగలు చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథ. అయితే ఈ సినిమాపై సినీ విశ్లేషకులు యావరేజ్‌ చిత్రంగానే మార్కులు వేశారు. కానీ ఇది కలెక్షన్లలో మాత్రం దూసుకుపోయింది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు నమోదు కానీ తొలి రోజు కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో చిత్ర యూనిట్‌ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు 'హ్యాపీ న్యూ ఇయర్‌' సినిమా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా విడుదలైన రోజే రికార్డు స్థాయిలో 45 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. దీపావళి మరుసటి రోజు విడుదలైన 'హ్యాపీ న్యూ ఇయర్‌'కు హిందీలో 42 కోట్ల 62 లక్షలు, తెలుగులో కోటి 43 లక్షలు, తమిళ్‌లో 92 లక్షల కలెక్షన్లు వచ్చాయి. అలాగే అతి తక్కువ కాలంలో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డులు బద్దలుకొట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి వారంలోనే.., అంటే మొదటి మూడు రోజుల్లోనే 108.86 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వసూలుచేసినట్లు రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ తెలిపింది. దీనికి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. తొలి మూడు రోజుల్లో హిందీ వెర్షన్ కు దేశవ్యాప్తంగా 104.10 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా, తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు 2.92 కోట్ల రూపాయలు, తమిళ మార్కెట్ లో 1.84 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. షారుక్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థే ఈ సినిమాను నిర్మించగా ఫరాఖాన్ దర్శకత్వం వహించారు. 2013లో చెన్నై ఎక్స్ ప్రెస్ మంచి వసూళ్లు సాధించిందని, ఇప్పుడు హేపీ న్యూ ఇయర్ మరో కొత్త రికార్డు కొట్టిందని రెడ్ చిల్లీస్ సంస్థ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, బొమ్మన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, సోనూ సూద్, వివాన్ షా వంటి భారీ స్టార్ కాస్టింగ్ ఇందులో ఉండటంతో, ఈ మూవీకి హైప్ పెరిగిందని బిటౌన్ ట్రేడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: