ఐదు పదుల వయస్సులో కూడా 8 పలకల దేహంతో కుర్ర హీరోలతో పోటీ పడుతూ రొమాంటిక్ సన్ని వేసాలలో నటిస్తూ భారీ ఫైటింగ్ సీన్స్ చేస్తున్న షారుఖ్ ఒక ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెరుగుతున్న తన వయస్సు గురించి తానెప్పుడు ఆలోచించననీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా షారుఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ బాలీవుడ్ లో రికార్డులను క్రియేట్ చేస్తోంది. భారతీయ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే సత్తా ఉందని అయితే అది ఎప్పుడూ అంటే తాను ఊహించి చెప్పలేనని అంటూ భగవంతుడు దయ తలిస్తే తానే ఆ రికార్డును క్రియేట్ చేసిన ఆశ్చర్యం లేదు ని అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని మరోసారి చాటుకున్నాడు షారూఖ్.  ఈ సందర్భంలోనే షారుఖ్ పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు అని వస్తున్న వార్తల పై స్పందిస్తూ తాను ఇంతకు వచ్చి అ సినిమాను చూడలేదని అంటూ తెలుగు సినిమాలు చూసే తీరిక తనకు లేదని, ‘అత్తారింటికి దారేది’ రీమేక్ పై వస్తున్న వార్తలు అన్నీ కూడా రూమర్స్ అంటూ తేల్చి పారేసాడు షారుఖ్.  అయితే ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షారుఖ్ తను శంకర్ తీస్తున్న ‘ఐ’ గురించి చాల ఆ శక్తిగా ఎదురు చూస్తున్నాను అంటు శంకర్ పై ప్రసంసాల వర్షం కురిపించాడు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఏ వయసులో ఉన్న హీరోలు అయినా పలకల దేహం పెంచుకోవచ్చు అన్న షారుఖ్ మాటలు మన సీనియర్ హీరోలు తమ రాబోతున్న సినిమాల కోసం అనుసరిస్తారేమో చూడాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: