టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలుగా చిరకాలం ఉండాలంటే, ముఖ్యంగా ఎటువంటి ఎక్స్ పరిమెంట్స్ చేయకుండా, పదే పదే రొటీన్ స్టోరిలను ఎంచుకొని బాక్సాపీస్ వద్ద సక్సెస్ సాధిస్తే సరిపోతుంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు కదా అని, తప్పుడు కథలతో ముందుకు వస్తే ప్రేక్షకులు ఇచ్చే జడ్జిమెంట్ చాలా ట్రాజిడిగా ఉంటుంది. ఆ తరువాత నుండి ఆ హీరోకి అవకాశాలు రాకవడం తగ్గిపోయి, తిరిగి కోలుకోవటానికి మరి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఇలాంటిదే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరో నిఖిల్ చేయబోతున్నాడు. తాజాగా థియేటర్లని హిట్ చేసిన కార్తికేయ్ మూవీ, సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సిటీ టూర్ ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే ఓ సరికొత్త సబ్జెక్ట్స్ తో హీరో మరో మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సారి తన బాడీ లాంగ్వేజ్ కి సంబంధం లేకుండా, ఓ భారీ కథలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడంట. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే నిఖిల్, ఆ కథకి సంబంధించిన పూర్తి స్టోరి వినడం, అందులో నటించేందకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరిగిపోయాయి. అయితే కొంత మంది మాత్రం ఆ మూవీలో నటించవద్దని నిఖిల్ కి చెబుతున్నప్పటికీ, కార్తికేయ మూవీ ఇచ్చిన సక్సెస్ కిక్ లో నిఖిల్ మరో ప్రయోగం చేయటానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. అయితే ఈసారి నిఖిల్ ఎంచుకున్న ట్రాక్ పూర్తిగా నెగిటివ్ రిజల్ట్ ని ఇస్తే, తను ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: