ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైన ఫేం వస్తే, వారికి సంబంధించిన సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ ని అకతాయిలు హ్యాక్ చేయడం కామన్ గా జరుగుతుంది. అందుకే సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ ని మెయింటెన్ చేసే స్టార్ డం సెలబ్రిటీలు, వారికి సంబంధించిన సోషియల్ సైట్స్ ని నిపుణుల పర్యవేక్షణలో చేస్తుంటారు. ముఖ్యంగా ఈ లిస్ట్ లో హీరోయిన్స్, హీరోలు, బడా నిర్మాలు వంటి వారు ఉంటారు. గతంలో చాలా మంది సెలబ్రిటీల విషయంలో ఈ తరహా హ్యాకింగ్ అలాగే ఫేక్ అకౌంట్స్ వంటివి జరిగాయి. అయితే ఈ లిస్ట్ లో ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత కూడా చేరిపోయాడు. బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి బాక్సాపీస్ గణేష్ గా పేరుతెచ్చుకున్న నిర్మాత బండ్ల గణేష్, ఫేక్ అకౌంట్స్ తో విసిగిపోతున్నాడు. తన పేరు మీదున్న అన్ని ఫేస్ బుక్ అకౌంట్ లు ఫేక్ అని నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేసారు. ఇటీవలే కొన్ని పుకార్లు, మార్ఫ్ చేసిన ఫోటోలు నెట్లో బండ్ల గణేష్ పేరుతొ హల్ చల్ చెయ్యడం, తాజాగా తన పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ నుండి రాంగ్ స్టేట్ మెంట్స్ వెళ్ళడంతో ఈ నిర్మాత స్పందించాల్సివచ్చింది. అలాగే ఓ హీరోయిన్ కి సంబంధించి తనుకు సోషియల్ నెట్ వర్కింగ్ లో కామెంట్ చేయడం, ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. దీంతో “నాకు ఎటువంటి ఫేస్ బుక్ ఎకౌంట్లు లేవు. ఇప్పుడు నెట్లో నా పేరుతొ చలామణి అవుతున్నవన్నీ ఫేక్ ఎకౌంట్లే. వాటికి నేను బాధ్యుణ్ణి కానని”స్పష్టం చేసారు. బండ్ల గణేష్ ఈ మేరకు ఒక కంప్లైంట్ ని కూడా ఫైల్ చేసినట్టు సమాచారం. అయితే బండ్ల గణేష్ పేరుతో పోస్టింగ్ లు జరుగుతున్న ఫేస్ బుక్ అకౌంట్స్ లో ఇప్పటికే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని మూవీలకి సంబంధించిన న్యూస్ ని బండ్ల గణేష్ ఫేక్ అకౌంట్ ని అఫిషియల్ గా రావడం, అని నిజంగా అలాగే జరగటంతో అందరూ ఆ ఫేక్ అకౌంట్స్ ని బండ్ల గణేష్ వే అని అనుకున్నారు. ఇప్పుడు ఈ బడా నిర్మాత అసలు విషయాన్ని తెలయిజేయడంతో, నెటిజెన్స్ అందరూ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: