పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్న అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ఫిల్మ్ గబ్బర్ సింగ్2. గబ్బర్ సింగ్2 అంటూ ఏ టైం లో మూవీని ముహుర్తం స్టార్ట్ చేశారో తెలియదు కాని, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకూ ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తుంది. గబ్బర్ సింగ్2 మూవీలో ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో తెలియదు కాని, మూవీ స్టార్ట్ అయ్యే లోపు మాత్రం జరిగే తతంగం అంతా ఓ నిజంగా సరికొత్త మూవీనే తలపిస్తుంది. ప్రస్తుతం గబ్బర్ సింగ్2 మూవీ దర్శకుడు ఎవరు? అన్న పాయింట్ మీద టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి మెగా ఫోన్ పట్టుకుంటున్నారా..? ‘గబ్బర్ సింగ్ 2′ సినిమాకు తనే దర్శకత్వం వహించానున్నారా..? వంటి విషయాలు టాలీవుడ్ మీడియాలోనే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి కరమైన కథనాలు నడుస్తున్నాయి. గతంలో గబ్బర్ సింగ్2 అనే ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందనే వార్తలు రావడంతో, చాలా కాలం తరువాత ఈ మూవీపై జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీకు అడ్డుకట్ట వేసేందుకు, ఈ ప్రాజెక్ట్ ని లాంచనంగా స్టార్ట్ చేశారు. అయితే ఇదంతా నిర్మాత ఒత్తిడి మేరకు పనవ్ కళ్యాణ్ చేశారనే టాక్ కూడ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు మళ్ళీ గబ్బర్ సింగ్2 మూవీ డైరెక్టర్ పై వస్తున్న వార్తలకి కూడ ఓ క్లారిటి ఇస్తే బాగుంటుందని.., ఇండస్ట్రీలో వినిపిస్తున్న వాదన. ‘గబ్బర్ సింగ్ 2′ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారని గతంలో ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాస్తున్నారని, దర్శకుడిగా సంపత్ నందిని తొలగించారని పుకార్లు చెలరేగాయి. అక్టోబర్‌ లో సంపత్‌ దర్శకత్వంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాత శరత్‌ మరార్‌ వివరణ కూడా ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో దర్శకుడు మారే అవకాశం ఎంత మాత్రం ఉండదూ. కాని ఇంకా షూటింగ్ మొదలవలేదు. తాజాగా పవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ తరహా వార్తలకి బ్రేక్ చెప్పాలంటే నిర్మాతలు దర్శకుడు ఎవరు అనే విషయంలో ఓ క్లారిటీ ఇస్తే బాగుటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: