బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఎఫైర్ వంటి విషయాలు చాలా కామన్. అయితే ఆ తరహా వ్యవహారాలు అన్ని సీక్రెట్ గానే జరుగుతాయి. వారు ఎంత సీక్రెట్ గా మెయింటెన్ చేయాలన్నా, ఆ విషయాలు ఏదొక రూపంలో బయటకు రావడం, తరువాత వారు సర్ధి చెప్పుకోవడం చాలా కామన్. కాని ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ లో జరిగింది. ఇప్పటి వరకూ ఏ హీరోతో ఘూటు రొమాన్స్ నడపని ఓ హీరోయిన్, తనకు ఏకంగా ఎఫైర్ ఉందంటూ, దానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడింది. దాంతో మీడియా సైతం అవాక్కయింది. ఇంతలా మీడియాని షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యూటీ ఎవరంటే, తనే బబ్లీ బ్యూటీ సోనాక్షి సిన్హా. సోనాక్షి సిన్హాకి బిటౌన్ లో పెద్దగా ఎపైర్స్ అంటూ ఏమి లేవు. ఏమైనా ఉంటే డేటింగ్ వంటి వ్యవహారాలను, మీడియాలో పెద్దగా ఫోకస్ అయ్యేవిధంగా కాకుండా జాగ్రత్తపడుతుంది. ఎక్కడికక్కడే జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే తాజగా ఓ ఈవెంట్ కి అటెండ్ అయిన సోనాక్షి సిన్హాని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న తనకి చిరాకు తెప్పించిందట. ఇంతకీ ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, “మిమ్మల్ని చాలా మంది హీరోలు ఎందుకు దూరం పెడుతుంటారు. మిమ్మల్ని డేటింగ్ పిలిచే హీరోలు కూడ చాలా తక్కువ మంది ఉన్నారంట కదా?” అంటూ అడిగాడు. దీంతో చిరాకు తెచ్చకున్న సోనాక్షి “నాకు బాయ్ ప్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోలు నాతో డేట్ కోసం క్యూలు కట్టుకొని ఉన్నారు. అలాగే నేను ఆల్రెడీ ఓ హీరోతో డేట్ లో ఉన్నాను. నా వ్యవహారం మాని, మీ పనులు చూసుకోండి. హీరోయిన్స్ అన్నప్పుడు డేట్ లు కామన్. వీటిని పెద్ద విషయాలు చేయద్దు.” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: