సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ ఓ స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్. శంకర్ తెరకెక్కిస్తున్న ప్రతీ మూవీ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శంకర్ పై, సినీ ప్రేక్షకులు విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ని పెట్టుకుంటారు. ఎందుకంటే శంకర్ తీసే చిత్రాలు అన్ని, ఓ విధమైన సోషియల్ మెసేజ్ తో ముడిపడి ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ తెరకెక్కించిన ఐ మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరగుతున్నాయి. అతి పెద్ద భారీ బడ్జెట్ ఫిల్మ్ గా ఐ మూవీ తెరకెక్కింది. అందుకే ఈ మూవీని ఎంత బాగా తెరకెక్కించారో, అలాగే అవుట్ పుట్ కోసం ఏ విధంగా కష్టపడ్డారో.., దీనిని ప్రమోట్ చేయడం కోసం కూడ శంకర్ అదే స్థాయిలో కష్టపడుతున్నాడు. అందుకే మూవీకి సంబంధించిన “ఐ 100 సీక్రెట్స్” అంటూ శంకర్ క్యాంపెయిన్ స్టార్ చేస్తున్నాడు. ఐ మూవీకి సంబంధించిన మేజర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని ఈ “ఐ 100 సీక్రెట్స్” లో శంకర్ వివరించబోతున్నాడు. దీనికి సంబంధించిన చిన్న విజువల్ వీడియోని సైతం శంకర్ రూపొందించినట్టుగా కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా మూవీ రిలీజ్ కి వారం రోజుల ముందుగా ఈ “ఐ 100 సీక్రెట్స్” ఫుల్ లెన్త్ వీడియాని రిలీజ్ చేయనున్నట్టు ఇండస్ట్రీ టాక్. అందులోని భాగంగానే శంకర్, విక్రమ్ ల మధ్య కెమిస్ట్రీని శంకర్ తెలియజేస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ బీస్ట్ గా, బాడీ బిల్డర్ గా, సూపర్ మోడల్ గా, వికృత రూపంతో కూడిన వ్యక్తిగా వైవిధ్యమైన గెటప్ లలో కనిపించనున్నారు. ఒక పాత్ర కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ఏకంగా 30 కిలోలు బరువు తగ్గారు. శంకర్ సూచన మేరకు విక్రమ్ బరువు తగ్గారని అప్పట్లో వార్తలు వచ్చాయి. బరువు తగ్గాలనే ఆలోచన విక్రమ్ దే అని తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకుడు శంకర్. ‘నేను విక్రమ్ కు స్క్రిప్ట్ వినిపించినపుడు బరువు తగ్గాలని చెప్పలేదు. బరువు తగ్గితే ఆ పాత్ర చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని విక్రమ్ చెప్పాడు. బరువు తగ్గాలనే ఆలోచన విక్రమ్ దే. అతని ఆరోగ్యం దృష్ట్యా నేను ఈ విషయం గురించి చాలా రోజులు ఆలోచించాను. డాక్టర్స్, డైటీషియన్లను సంప్రదించిన తర్వాత ఓకే చెప్పాను. అని శంకర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: