టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తన కంటూ ఓ స్టార్ డం ని క్రియేట్ చేసుకుంటున్న హీరోయిన్ కలర్ స్వాతి. ముఖ్యంగా కలర్ స్వాతి నటించే సినిమాలు అన్ని స్టోరి పరంగా బాగుండటంతో, ఆ మూవీలు బాక్సాపీస్ వద్ద సక్సస్ గా నిలుస్తున్నాయి. ఇదంతా తను సెలక్ట్ చేసుకుంటున్న స్టోరిలతోనే సాధ్యపడుతుంది. ఇదిలా ఉంటే కలర్ స్వాతి ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ రోల్స్ ని చేయటానికి ఆసక్తి చూపుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల మూవీలలో కీ రోల్స్ ని చేయటానికి కలర్ స్వాతి ఆసక్తి చూపుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. బుల్లితెరలో యాంకర్ స్థాయి నుండి సిల్వర్ స్క్రీన్ లో హీరోయిన్ వరకూ సాగిన కలర్ స్వాతి ప్రయాణంలో, ఇప్పటి వరకూ చిన్న హీరోల సరసన హీరోయిన్ గా చేసింది. బడా హీరోల మూవీలో హీరోయిన్ గా అవకాశాలు అంటే దాదాపు కుదిరే పని కాదనిపిస్తుంది. అందుకే టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోల మూవీలలో తను కీ రోల్స్ ని చేయటానికి సిద్ధపడుతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఆ విధంగానే నాగార్జున మూవీకి సంబంధించి ఓ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో కలర్ స్వాతి, నాగార్జునకి చెల్లలి పాత్రలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించిన కథని కలర్ స్వాతి విన్నట్టు, స్టోరి నచ్ఛడంతో వెంటనే ఒప్పుకున్నట్టు టాలీవుడ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ లిమిటెడ్ ఆఫర్స్ అందుకుంటున్న కలర్ స్వాతి, తాజాగా తను తీసుకున్న నిర్ణయంతో ఎక్కువ ఆఫర్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అటు కోలీవుడ్ లోనూ కలర్ స్వాతికి మంచి డిమాండ్ ఉంది. ఓ రకంగా తెలుగు కంటే తమిళ్ మార్కెట్ లోనే కలర్ స్వాతికి మంచి గుర్తింపు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: