పూరి జగన్నాథ్ తీసిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆదాశర్మ సినిమాలలో హీరోయిన్స్ చేసే ఎక్స్ పోజింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కథ అవసరం బట్టి ఎక్స్ పోజింగ్ కు లిప్ లాక్ లకు రెడీ చెప్పే హీరోయిన్స్ లాగే అదాశర్మ కూడా ఈ సన్నివేశాలలో నటిస్తున్నా అటువంటి సన్నివేశాలలో తనకు నటించడం ఇష్టం లేదు అంటూ ఒక సంచలనాత్మక కామెంట్ చేసింది.  ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించిన ఆదాశర్మ కుటుంబ సబ్యులకు ఈమె సినిమాలలో నటించడం ఇష్టం లేదట. అయితే తన చిన్నతనం నుండి టీవీలలో ఐశ్వర్యా, మాధురీలను చూసి సినిమాలంటే మోజు పెంచుకోవడమే కాకుండా వారిని చూస్తూ యాక్టింగ్ నేర్చుకున్నానని చెపుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.  సినిమాలు అంటే గిట్టని తన కుటుంబ సభ్యులను ఏదోవిధంగా ఒప్పించి సినిమా రంగంలోకి వచ్చే ముందు తాను నటించే సినిమాలలో స్కిన్ షో చేయను అని మాట ఇచ్చిందట. అయితే ఇక్కడ ఉన్న పోటీ వాతావరణంలో నిలబడటానికి స్కిన్ షో చేయకుండా కుదరడంలేదు అని అంటోంది. తనలాగే తమకు ఇష్టం లేకపోయినా ఎంతోమంది హీరోయిన్స్ అయిష్టంగానే స్కిన్ షో చేస్తున్నారని ఈ బ్యూటీ భావన. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ పక్కన నటిస్తున్న ఆదాశర్మ ఫీలింగ్స్ తెలుసుకుని త్రివిక్రమ్ ఈమెను ఎక్స్ పోజింగ్ సీన్స్ లో లేకుండా నటింప చేసి ఆదాశర్మ కోరిక తీరుస్తాడేమో చూడాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: