జూనియర్ స్నేహితులతో నైట్ పార్టీలు చేసుకుంటూ పబ్బులలో హడావిడి చేసాడు అంటూ ఎన్టీఆర్ పై వార్తలు వచ్చిన సందర్భాలు చాల అరుదు. కాని అటువంటి జూనియర్ గోవాలో దర్శకుడు పూరి హీరోయిన్ కాజల్ తో కలిసి పార్టీ చేసుకోవడమే కాకుండా ఆ పార్టీని జూనియర్ బాగా ఎంజాయ్ చేసాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా బయట పెట్టింది. పార్టీని ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఫోటోను కాజల్ తీయడానికి ప్రయత్నిస్తే వద్దు అంటూ నవ్వుతూ చెప్పినా కాజల్ ఆ మాటలు వినకుండా తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పెట్టడమే కాకుండా సరదాగా కామెంట్స్ కూడా చేసింది. తెల్ల షర్ట్ పైన కోటు వేసుకుని చేయి అడ్డు పెట్టుకుని నవ్వుతున్న జూనియర్ ఈ ఫోటోలో మంచి జోష్ లో కనిపిస్తున్నాడు. ‘రభస’ ఇచ్చిన నిరాశను మరిచిపోయి పూరీతో కలిసి ఏదోవిధంగా హిట్ కొట్టాలి అన్న పట్టుదలతో తన లుక్ ను మార్చుకుని పోలీస్ గా ఈ సినిమాలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.  ఈమధ్య సినిమా కార్మికుల సమ్మె వల్ల ఆగిపోయిన సినిమా షూటింగ్ గత రెండు రోజుల నుండి గోవాలో మొదలైంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి సంక్రాంతి రేసుకు నిలబడాలి అన్న జూనియర్ పట్టుదలకు ఈ సినిమా అనుకున్న విధoగా పూర్తి అయి జూనియర్ కోరుకున్న హిట్ ను ఇస్తుందో లేదో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: