మంచు మనోజ్ హీరోగా రాబోతున్నశుక్రువారం విడుదల కాబోతున్న ‘కరెంటు తీగ’ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతోంది. ఇప్పటి వరకూ టాప్ హీరోల సినిమాలు కూడా విడుదల కాని వివిధ దేశాలలో విడుదలవుతూ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో రిలీజవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా 'కరెంట్ తీగ' రికార్డుకెక్కబోతోంది అనే వార్తలు వస్తున్నాయి.  అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశాలతో పాటుగా అనేక ముస్లిమ్ దేశాలు మలేషియా, షార్జా, దుబాయ్, రస్ అల్ ఖైమా, అబు దాబి, కువైట్, ఒమన్ లాంటి దేశాలతో పాటుగా సౌత్ ఆఫ్రికా, ఉగాండా, కెనడా లాంటి అనేక దేశాలలో ఉన్న తెలుగు వారికి తన ‘కరెంట్ తీగ’ పవర్ ను చూపెట్టడానికి మంచు మనోజ్ రంగంలోకి దిగడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  ఈమధ్య ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ ఒకనాటి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నా ఆమె పాత్రలో ఎటువంటి అశ్లీలత ఉండదని కేవలం సాంప్రదాయ బద్దంగా కనిపించే టీచర్ పాత్రలో కనిపిస్తుందని కామెంట్స్ చేసాడు విష్ణు. అయితే ఐటమ్ సాంగ్ లో మాత్రం కాస్త గ్లామరస్ గా కనిపిస్తుందని అసలు విషయం బయట పెట్టాడు.  ఎదిఎలా ఉన్నా గతంలో ఎప్పుడు లేని విధంగా మంచు మనోజ్ ‘కరెంటు తీగ’ కు సన్నీ లియోన్ వల్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అన్న మాట వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి: