‘లెజెండ్’ సూపర్ హిట్ తరువాత బాలకృష్ణ నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమాకు మొదట్లో ‘గాడ్సే’ గా ప్రచారం జరిగి తరువాత ‘వారియర్’ గా మారింది. అయితే ఈ రెండు టైటిల్స్ బాలకృష్ణకు నచ్చక పోవడంతో ఈ సినిమా దర్శకుడు బాలయ్యకు ‘లయన్’ అనే టైటిల్ ఈ సినిమాకు బాగుంటుందని సూచించాడు అని టాక్.  అయితే  ‘లయన్’ పదానికి తెలుగు అనువాదంగా తాను గతం లో  నటించిన ‘సింహ’ వచ్చింది కాబట్టి ఈ టైటిల్ పెడితే జనం ‘సింహ’ సినిమాకు తన కొత్త సినిమా సీక్వెల్ అని అనుకుంటారు అన్న ఉద్దేశ్యంతో బాలయ్య ఈ సినిమా టైటిల్ గురించి ఇంకా లోతుగా ఆలోచిద్దాం అని ఈ సినిమా యూనిట్ వారికి సూచన చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.  శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా పనులు అన్నీ అనుకుంటున్నట్లుగా పూర్తి అయితే తనకు కలిసి వచ్చే సంక్రాంతి సెంటిమెంట్ ను కలుపుకుని ఈ సినిమాను సంక్రాంతి రేసుకు తీసుకు రావాలని బాలయ్య చాల పట్టుదల పై ఉన్నాడు అన్న వార్తలు ఇప్పటకే వచ్చాయి.  బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కూడా నేటి వర్తమాన రాజకీయాలను టార్గెట్ చేస్తూ బాలయ్య మార్క్ పంచ్ డైలాగ్స్ ఉంటాయి న్న ప్రచారం జరుగుతోంది. వస్తున్న వార్తల ప్రకారం బాలయ్య ‘లయన్’ గావస్తాడా?లేదంటేఇంతకన్నా పవర్ ఫుల్ టైటిల్ వైపు అడుగులు వేస్తాడా? అనే విషయం రానున్న రోజులలో తేలిపోతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: