సైడ్ బిజినెస్... తారలకి అలవాటే. వెనకేసుకున్న నాలుగు కాసులనూ కొత్త వ్యాపారాల్లో పెట్టడం తారలకి కొత్త కాదు. ఈ వరుసలో ఇప్పుడు శ్రియ కూడా చేరబోతోంది. ముంబైలో ఒక ఫిట్ నెస్ స్టూడియోని త్వరలో ప్రారంభించనుంది. అయితే, ఒక్క ముంబైయే కాదు... చెన్నై, హైదరాబాద్, బెంగళూర్లలో కూడా ఒకే రోజు ఈ స్టూడియో ప్రారంభోత్సవం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలా ప్రచారం చేయిస్తున్నది కూడా శ్రియేనే అంటున్నారు. ఎందుకంటే.... హైప్ కోసమట. ఇంతకీ ఒక స్టూడియో ప్రారంభిస్తున్నట్టా... నాలుగా... ఏమో? చేసేదేదో సరిగ్గా చెప్పొచ్చుగా... ఈ తల తిక్క వ్యవహారం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమౌతున్నదేంటంటే... శ్రియ ఈ మధ్య ఎలాగైనా వార్తల్లో ఉండాలని తపన పడుతోందని. ఆ మధ్య ‘స్క్రిప్టు డిమాండ్ చేస్తే దేనికైనా రెడీ’ అంటూ ఓ సంచలన వ్యాఖ్య చేసి కొన్నాళ్ల వార్తల్లో ఉంది. ఇప్పుడు ఈ గందరగోళంతో మరికొంత మైలేజ్ కోసం చేస్తున్నట్టుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: