ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మూవీ కత్తి. వివాదాల నడుమ ఇటీవల విడుదలై తమిళనాడులో ఘన విజయం సాధించిన 'కత్తి' చిత్రం ఇప్పుడు మరో సమస్యలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ సమస్య నుండి హీరో అలాగే దర్శకుడు ఏ విధంగా బయట పడాలో అంటూ తెగ ఆలోచిస్తున్నారు. మేటర్ లోకి వెళితే కత్తి మూవీలో నటించినందకు హీరో విజయ్‌తోపాటు, దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై స్థానిక కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. ఈ సినిమాలో కోర్టులో విచారణ జరుగుతున్న 2జీ స్పెక్ట్రమ్ కేసును ప్రస్తావించినందుకు ఈ కేసు దాఖలైంది. ఈ కేసుపై ఓవైపు ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతుండగా, ఈ వ్యవహారంలో అవినీతి జరిగినట్లుగా నిర్ధారిస్తూ ఈ సినిమాలో ఓ డైలాగ్‌ను పెట్టారు. ఆ విధంగా చేసిందుకు వీరిద్దరిపై చట్టరిత్యా కేసును నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 500 అంటే పరువుకు నష్టం కలిగించడం వంటి చర్యల కింద ఈ వ్యాఖ్య చేయడం నేరమని ఆర్. రామసుబ్ర మణియన్ అనే న్యాయవాది మదురైలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. ఇటువంటి డైలాగ్‌లు దేశానికి రావాల్సిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రభావం చూపుతాయన్నది ఆయన వాదన. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది. అయితే ఈ కేసు వాయిదా సమయం దగ్గరకు వచ్చేలోపే విజయ్, మురుగుదాస్ ఇద్దరూ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని సెటిల్ మెంట్ చేసుకొనే దిశలో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విజయ్ అభిమాన సంఘం, ఆ లాయర్ తో సంప్రదింపులు జరిగింది. అంతే కాకుండా పొలిటికల్ గానూ ఆ న్యాయవాది పై ఒత్తిడి తెచ్చేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: