సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక. హన్సిక ప్రస్తుతం ఫుల్ బిజి కాల్షీట్స్ తో ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తుంది. ప్రస్తుతం తన చేతిలో నాలుగు చిత్రాల వరకూ ఉన్నప్పటికీ తన మనస్సు మాత్రం ఓ హీరో సరసన నటించాలని ఉందని గత కొంత కాలంగా చెప్పుకుంటూ వస్తుంది. అయితే తను ఎంతగానో ఎదురు చూస్తూ వస్తున్న ఆ ఆఫర్ తన చేతికి వచ్చినట్టే వచ్చి, చివరి నిముషంలో చేజారిపోయింది. మేటర్ లోకి వెళితే, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో రొమాన్స్ చేయాలన్నది హన్సిక చిరకాల కోరిక. ఈ విషయాన్ని ఈ బ్యూటీనే పలు సందర్భంలో వెల్లడించింది. దీంతో ఈమె ఆశ నెరవేరబోతోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. హన్సిక కూడా ఖుషీగా ఉన్నట్లు సమాచారం. అయితే దర్శకుడు శివ ఆమె ఆశపై నీళ్లు చల్లారు. వీరం వంటి విజయవంతమైన చిత్రం తరువాత దర్శకుడు శివ అజిత్ హీరోగా మరో చిత్రం తెరకెక్కించడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో అజిత్ సరసన హన్సిక నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కేవలం ఇది ప్రచారంగా మాత్రమే కాకుండా, అఫిషియల్ అంటూ ఆ మధ్య హన్సిక సైతం అవును అంటూ కొంత మంది ఫ్యాన్స్ కి కూడ చెప్పిందట. దీంతో అజిత్ హన్సికల కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందనే టాక్ కోలీవుడ్‌లో జోరందుకుంది. అందుకు దర్శకుడు శివకి అజిత్ నో చెప్పాడని తెలస్తుంది. హన్సిక ను కాకుండా మరో హీరోయిన్ ని చూడాలని దర్శకుడుని అజిత్ కోరడంతో, ఇప్పుడు హీరోయిన్ ను మార్పుచేసే ప్రయత్నంలో ఉంది అజిత్ టీం. ఇదే విషయాన్ని దర్శకుడు శివ కూడ చెప్పుకొచ్చారు. “తన చిత్రంలో అజిత్ సరసన హన్సిక నటించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు”. అజిత్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇది అజిత్ 55వ చిత్రం. కాగా తదుపరి శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇది యాక్షన్ డ్రామా కథ చిత్రమేనని దర్శకుడు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: