టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్ చేసే రోల్స్ ప్రేక్షకులను అలరించేలా ఉంటాయి. ముఖ్యంగా కృష్ణ భగవాన్ కామెడీ అంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. అయితే ఈ మద్య కాలంలో కృష్ణ భగవాన్ మూవీల్లో తక్కువుగా కనిపిస్తున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఇండస్ట్రీలోకి దూసుకువస్తున్న కొత్త కమెడియన్స్. అయితే ఈ కొత్త కమెడియన్స్ చేసే రోత కామెడీ, కృష్ణ భగవాన్ సీరియస్ అయ్యాడు. దాంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రస్తుతం అంతా చీప్ కమెడియన్స్ వస్తున్నారని వర్థమాన హాస్యనటులపై సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ విరుచుకుపడ్డాడు. వీరంతా కామెడీ అనే పదం పరువు తీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చీప్ కామెడీని నమ్ముకుని వస్తున్న ప్రస్తుత తరం నటులకి అసలు 'కామెడీ టైమింగ్' అంటే ఏమిటో తెలియదని ఆయన మండిపడ్డాడు. టీవీలో వచ్చే కామెడీ షోలలో కాస్త పేరు రాగానే, వీరికి సినిమాల్లో ఈజీగా అవకాశాలు వస్తున్నాయని... దీంతో, వీరంతా సూపర్ స్టార్లలా ఫీలయిపోయి సినిమా సెట్స్ లో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించాడు. హాస్యనటులు సినిమాల్లో ఆడవేషాలు వేయడం కొత్త కాదని, అయితే టీవీ షోలలో కమెడియన్లు ఆడ వేషాలు వేసినప్పుడు చాలా వల్గర్ గా చేస్తున్నారని ఆయన విమర్శించారు. కృష్ణ భగవాన్ ఈ విధంగా మాట్లాడంతో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కృష్ణ భగవాన్ మాట్లాడిన మాటల్లో తను ఎవరిని టార్గెట్ చేశారు అన్నది చాలా స్పష్టంగా ఉంది. కృష్ణ భగవాన్ కి మరి కొందరు సీనియర్ కమెడియన్స్ సైతం సపోర్ట్ ఉన్నారని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: