పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మెగా స్టార్ చిరంజీవి ఝలక్ ఇచ్చాడని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా వ్యక్తిగత విషయంలో ఏమాత్రం కాదు. సినిమా పరంగా పవన్ కళ్యాణ్ చేయబోతున్న మూవీని చిరంజీవి హైజాక్ చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా కోలీవుడ్ లో సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన కత్తి మూవీని, ఠాగూర్ మధు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కోసం రిమేక్ రైట్స్ ని తీసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కత్తి మూవీ రిమేక్ లో నటించే అవకాశం ఎంత మాత్రం కనపడంటం లేదు. దీంతో ప్రస్తుతం ఈ మూవీ చిరంజీవి వద్దకు వెళ్ళిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, చిరంజీవి తన 150వ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు. చిరంజీవి వద్దకు వచ్చిన కథల్లో చాలా మార్పులు అవసరం అవుతున్నాయి. అయితే కత్తి మూవీలో రైతులు గురించిన సమస్యలు ప్రధాన ఎజెండా కావడం, ఆ మూవీ చూపించిన తీరు కూడ చాలా బాగుండటంతో, అది బాక్సాపీస్ వద్ద బారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. అందుకే కత్తి మూవీలోని స్టోరి లైన్ ని చిరంజీవి తన 150వ మూవీలో పెట్టుకునేందుకు చర్చలు జరగుతున్నట్టు టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. కత్తి తెలుగు రిమేక్ హక్కులు సొంతం చేసుకున్న నిర్మాత సైతం, చిరంజీవి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి టాక్స్ మరి కొద్ది రోజుల్లో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ అన్ని అనుకున్నట్టు జరిగితే పవన్ కళ్యాణ్ చేయాల్సిన కత్తి మూవీ ప్రాజెక్ట్, చిరంజీవి తీసుకొని, పవన్ కళ్యాణ్ నుండి ఓ మంచి మూవీని తీసినవాడవుతాడని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: