ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్. కెనడియన్ పోర్న్ స్టార్ గా ప్రఖ్యాతి చెందిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఇండియన్ బాక్సాపీస్ మార్కెట్, ఇండియన్ సినీ పల్స్ ఎంటో తెలుసుకుంది. అందుకే ప్రస్తుతం సన్నీలియోన్ చేతిలో దాదాపు ఏడు చిత్రాల వరకూ ఉన్నాయి. తన చేతిలో ఉన్న అన్ని చిత్రాలు క్రేజీ ప్రాజెక్ట్సే. అయితే ప్రస్తుతం సన్నీలియోన్ కి మర్కెట్ లో భారీ డిమాండ్ ఉంది. తను నటిస్తున్న మూవీలకి ప్రమోషన్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. దీంతో సన్నిలియోన్ పై ఉన్న పోర్న్ స్టార్ ముద్రని తీసేసి, తనలో ఉన్న యాక్టర్ ని, గ్లామర్ ని మాత్రమే వాడుకోవాలని బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ భావిస్తుంది. ఆ ఉద్ధేశంతోనే కొంత మంది దర్శక నిర్మాతలు, సన్నిలియోన్ కోసం ప్రత్యేకంగా కథలని రెడీ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో సన్నిలియోన్ మాత్రం తన గ్లామర్ ని ఎప్పటి కప్పుడు, సినీ ప్రేక్షకులని రెచ్చగొట్టేలా చేస్తుంది. దీంతో సన్నిలియోన్ పై పెట్టుబడి పెడుతున్న కొంత మంది నిర్మాతలకి అది నష్టంగా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సన్నిలియోన్ ని మంచి యాక్టర్ గా చూపించాలంటే, ముందు తను గ్లామర్ బ్యూటీ కాదనే విషయాన్ని ప్రేక్షకులు తెలుసుకోవాలి. కాని సన్నీలియోన్ చేస్తున్న చేష్టలకి, ఇప్పుడు తన చేతి నుండి కొన్ని ప్రాజెక్ట్స్ వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే త్వరలో సన్నీలియోన్ ఓ షార్ట్ ఫిల్మ్ చేయబోతుంది. ఇందులో తను న్యూడ్ తో కనిపించనుందట. ఓ సోషియల్ మెసేజ్ కోసం సన్నిలియోన్ న్యూడ్ గా కనిపించినుంది. త్వరలోనే తను న్యూడ్ గా నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో ప్రత్యక్షం కానుంది. మొత్తానికి సన్నిలియోన్ ని ఎంత మంచి యాక్టర్ గా హైలెట్ చేయాలన్నా, తను మాత్రం తన గ్లామర్ ని మాత్రమే నమ్ముకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: