టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన న్యూస్ అయితే ఏదో ఒకటి హాట్ టాపిక్ గా మారుంది. నిజానికి జరుగుతున్నది ఒకటైతే, బయటకు వచ్చేది మరొకటి. దీంతో నెటిజెన్స్ కి రకరకాల న్యూస్ లు చెప్పే వెబ్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలు సైతం, వారు గాసిప్స్ కి అంతే ఉండదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ ఫిల్మ్ పై ఓ రూమర్ బయటకు వచ్చింది. గతంలో మహేష్ బాబు నటించిన అర్జున్ మూవీ, బాక్సాపీస్ వద్ద అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. కాని మహేష్ బాబుకి మాత్రం ఆ తరహా సిస్టర్ సెంటిమెంట్ ఉన్న కమర్షియల్ మూవీ చేయాలని కోరిక ఉందట. సరిగ్గా చాలా కాలంలో తరువాత కొరటాల శివ రూపంలో మహేష్ ఇప్పుడు ఆ తరహా మూవీ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ రెడీ చేసిన కథ సిస్టర్ సెంటిమెంట్ కథే అంటూ టాలీవుడ్ లోనూ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా వస్తున్న వార్తలు నిజం కావని దర్శకుడు కొరటాల శివ క్లారిఫై చేశాడు. “మహేష్ బాబు కు సిస్టర్ సెంటిమెంట్ స్టోరిలు ఇష్టం అంటూ ఏమి లేదు. ముఖ్యంగా మా ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ అస్సలు లేదు. ముఖ్యంగా ఈ కథ పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతంది.దయచేసి ఇటువంటి రూమర్స్ ని స్ర్పెడ్ చేయవద్దని” చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే నవంబర్ మొదటి వారంలోనే కొరటాల శిర, మహేష్ బాబు ల మూవీ సెట్స్ మీదకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: