కొంత కాలం టాలీవుడ్ సినిమాలలో కృష్ణభగవాన్ పాత్ర లేకుండా సినిమాలు ఉండేవికావు. కాని గత కొంతకాలంగా టాలీవుడ్‌ సినిమా రంగంలోకి వస్తున్న కొత్తకొత్త కమెడియన్స్ ధాటీకి కృష్ణభగవాన్ తట్టుకోలేక పోవడంతో ఇప్పుడు ఆయనకు అవకాశాలు చాల అరుదుగానే వస్తున్నాయి.  అనుకోని ఈ పరిస్థుతుల వల్ల నిరాశకు లోనై కామెంట్ చేసాడా? లేదా నేటి వాస్తవిక పరిస్థుతులను దృష్టిలో పెట్టుకుని కామెంట్లు విసిరాడా? అనే విషయం పై క్లారిటీ లేకపోయినా నేటి తరం కమెడియన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు అనే వార్తలు వస్తున్నాయి.  ఈరోజులలో చాలామంది కమెడియన్స్ బుల్లితెర పై ప్రసారమయ్యే కామెడీ షోలలో కాస్త పేరు రాగానే సినిమాల్లో సింపుల్‌గా అవకాశాలు దక్కించుకుంటున్నారని, దీంతో వాళ్లంతా సూపర్ స్టార్స్‌లా ఫీలై సినిమా సెట్స్‌లో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని అంటూ ఘాటు కామెంట్లు చేసాడు కృష్ణభగవాన్.  హాస్యనటులు సినిమాల్లో ఆడవేషాలు వేయడం కొత్త కాకపోయినా ప్రస్తుతం టీవీ షోలలో కమెడియన్లు ఆడ వేషాలు వేసినప్పుడు చాలా వల్గర్‌గా డైలాగ్స్ చెపుతూ కామెడీ అనే పదానికి పరువు పోగోడుతున్నారని అభిప్రాయ పడ్డాడు కృష్ణభగవాన్. కామెడీ టైమింగ్ గురించి అవగాహన కూడా లేని హాస్య నటులు సినిమాలలో నటించడం చూస్తూ ఉంటే తెలుగు సినిమా హాస్యం ఎలా మారిపోయింది అనే భావన తనకు కలుగుతోందని కృష్ణభగవాన్ చేసిన కామెంట్లు టాలీవుడ్ కు షాకింగ్ గా మారాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: