రాజమౌళి ‘బాహుబలి’ 2015 ఏప్రియల్ 17న విడుదల కాబోతోంది అనే విషయం ఓపెన్ సీక్రెట్. ఎన్నో భారీ అంచనాలతో టాలీవుడ్ రికార్డులను తిరగరాసే సినిమాగా ఇప్పటికే ప్రచారం పొందుతున్న ఈ అత్యంత భారీ సినిమాకు రెండు మూడు వారాలు అటు ఇటుగా మరో భారీ సినిమా రిలీజ్ కావడానికి సాహసం చేయదు.  అటువంటిది బాలకృష్ణ సత్యదేవా దర్శకత్వంలో లేటెస్ట్ గా నటిస్తూ ‘లయన్’ అనే టైటిల్ తో రాబోతోంది అని ప్రచారం జరుగుతున్న ఈ సినిమా విడుదల సంక్రాంతికి ఉంటుందని అనుకున్నారు అంతా. అయితే అందరి ఆలోచనలను తారుమారు చేస్తూ ఈ సినిమాను సంక్రాంతికి బదులుగా రాబోతున్న సమ్మర్ స్టార్టింగ్ లో రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం గతంలో సెంటిమెంట్‌గా సింహా, లెజెండ్ రెండు సినిమాలు సమ్మర్‌లోనే విడుదలై సూపర్ హిట్ కొట్టిన నేపధ్యం ఈ నిర్ణయానికి ఈ సినిమా నిర్మాతలు వచ్చేలా చేసింది అని అంటున్నారు. ఈ సంవత్సరం బాలకృష్ణ కెరియర్ లో టాప్ హిట్ గా నిలిచిన ‘లెజెండ్’ మార్చి 28న విడుదల అయిన నేపధ్యంలో ‘లెజెండ్’ రిలీజయిన రోజునే బాలయ్య కొత్త సినిమాను విడుదల చేస్తే సూపర్ హిట్ ఖాయం అనే సెంటిమెంట్ ఈ సినిమా నిర్మాతలతో పాటు బాలకృష్ణకు కూడా ఏర్పడింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వార్తలే నిజం అయితే బాలకృష్ణ సినిమాకు ‘బాహుబలి’కి మధ్య రెండు వారాలు మాత్రమే గ్యాప్ ఉంటుంది. అయితే ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాకు ముందు బాలయ్య సినిమాను ఎందుకు తీసుకు వస్తున్నారు అన్న టెన్షన్ అప్పుడే బాలయ్య అభిమానులలో ఏర్పడింది అని అంటున్నారు. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన ఈ సాహసాన్ని బాలకృష్ణ కేవలం సెంటిమెంట్ ను నమ్ముకుని తన సినిమా రిలీజ్ విషయంలో చేస్తాడా ? అన్నదే ప్రశ్న...  

మరింత సమాచారం తెలుసుకోండి: