రేణు దేశాయ్ తనకు హైదరాబాద్ పుట్టిల్లు అనీ పూణే తనకు అత్తిల్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు పవన్ నామస్మరణ అను నిత్యం చేసే రేణు భాగ్యనరం పై కూడా విపరీతమిన మమకారాన్ని కనపరుస్తూ ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది.  భాగ్యనగర అందాలే కాకుండా భాగ్యనగరంలో లభించే వివిధరకాల రుచులకు చిరునామాగా ఉండే హైదరాబాద్ లోని చట్నీస్ రెస్టా రెంట్ లో దొరికే స్టీమ్ ఇడ్లీ తనకు ఇష్టమని చెపుతూ దానితో పాటు హైదరాబాద్ ఇరానీ చాయ్ తాను ఎక్కడకు వెళ్ళినా మరిచిపోలేను అంటూ భాగ్యనగర అందాలను భాగ్యనగర రుచులను ఆకాశానికి ఎత్తేసింది రేణు.  ఇప్పటికే ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో తన దగ్గరకు వస్తే తాను సినిమాలు తీస్తాను, మంచి పాత్రలు లభిస్తే సినిమాలలో నటిస్తాను అని చెపుతున్న రేణు మాటలను బట్టీ ఈమె పవన్ తో విడిపోయినా హైదరాబాద్ ను తన శాశ్విత చిరునామాగా మార్చుకుని పవన్ ఇమేజ్ ను వాడుకుంటూ ఇక్కడే ఉండి పోతుందా? అని అనిపించేడట్లుగా రేణు దేశాయ్ మీడియాలో తరుచూ సందడి చేస్తోంది. మరి టాలీవుడ్ పరిశ్రమ రేణు విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: