ఫిల్మ్ ఇండస్ట్రీకి, పొలిటికల్ ఫీల్డ్ కి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న హీరోలు, రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రులుగా మారి, సంవత్సరాలు పాటు అధికారంలో ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులు, ఫిల్మ్ సెలబ్రిటీల అవసరాలను తీర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరోని, పొలిటికల్ లీడర్ బెధించినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇష్యూ జరిగింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాదు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీసెంట్ గా రిలీజ్ అయిన కత్తి మూవీ బాక్సాపీస్ ని షేక్ చేయడమే కాకుండా, కొందరి పొలిటికల్ లీడర్స్ ని భయపెడుతుందట. ముఖ్యంగా తమిళనాడు చెందిన ఓ ఎమ్మేల్యే కత్తి మూవీని చూసి, విజయ్ నటించిన తీరు, తను చెప్పిన డైలాగులు పట్ల అసహం వ్యక్తం చేశాడట. అంతే కాకుండా విజయ్ కి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ మూవీలో 2జీ స్పెక్ట్రమ్ కేసులోని దోషులను నిర్ధారించినందుకు ఓ న్యాయవాధి హీరో, డైరెక్టర్ పై కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. మొత్తంగా కత్తి మూవీపై రోజుకో ఇష్యూ బయటకు రావడం, విజయ్ అభిమానులని కలవర పరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: