టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనువాస్ పై ఓ న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో త్రివిక్రమ్ ఏ విధంగా ఉంటాడు, ఒక వేళ హీరోయిన్స్ నచ్ఛపోతే వారిపై త్రివిక్రమ్ ఏవిధంగా ఉంటాడో వంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో మూడో హీరోయిన్ గా ప్రణీతను ఎంపిక చేసుకున్నారని...అయితే, ఆఖరి నిమిషంలో తనని రిప్లేస్ చేసి, నిత్యా మీనన్ ను తీసుకున్నారనే విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందుగా ప్రణీతనే తీసుకున్నారట. ప్రణీత కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడ చేసిందట. అయితే, సినిమాకి సంబంధించిన ఓ కీలక సన్నివేశంలో, ప్రణీత ఎలా ఉండాలో త్రివిక్రమ్ ఆమెకు ముందుగానే సూచించాడట. షూటింగ్ రోజున ప్రణీత తాను ఊహించిన దానికి పూర్తి భిన్నమైన లుక్ లో సెట్ లోకి రావడంతో, అందరిముందు త్రివిక్రమ్ ఆమెపై ఫైర్ అయ్యాడట. అయితే ప్రణీతపై మొదటి నుండి త్రివిక్రమ్ కోపంగానే ఉన్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా అందరి మద్యలో తనని అవమానించారనే విషయంలో ఆగ్రహం చెందిన ప్రణీత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి వెంటనే సెట్ ను వదిలి వెళ్లిపోయిందట. ఈ కారణంగా, ఆమె స్థానంలో హడావుడిగా నిత్యామీనన్ ను త్రివిక్రమ్ ఎంపిక చేశాడని సమాచారం. అయితే హీరోయిన్స్ విషయంలో త్రివిక్రమ్ చాలా సీనియస్ ఉంటాడని, అలా సీరియస్ గా ఉండేది కొంత మంది హీరోయిన్స్ తోనే అంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: