నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. వరస విజయాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అలాగే తను రాజకీయ నాయకుడుగా మారిన తరువాత, తను ఎంచుకుంటున్న కథల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే బాలయ్య నటించబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. అయితే బాలక్రిష్ణ నటించబోతున్న 99వ చిత్రానికి దర్శకుడుని ఎంపిక చేశారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు లౌక్యంతో హిట్ కొట్టిన శ్రీవాసు అని తెలుస్తోంది. ఆ మధ్యన బాలకృష్ణ కోసం కోన వెంకట్, గోపీ మోహన్ ఓ కథ చెప్పిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. లెజెండ్ తో విజయోత్సాహంలో ఉన్న బాలకృష్ణ... తన తర్వాతి చిత్రం అంటే 98వ చిత్రం షూటింగ్ లో కంటిన్యూగా పాల్గొంటున్నారు. ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ అనే నూతన దర్శకుడు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: