మెగా హీరో రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నాడంటూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ కి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ మార్కెట్ ఉన్నప్పటికీ తన రెమ్యునరేషన్ ని కొద్దిగా తగ్గించుకున్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళితే రామ్ చరణ్ రీసెంట్ గా నటించిన మూవీ గోవిందుడు అందరివాడేలే. కొద్ది రోజుల క్రితం ‘గోవిందుడు అందరి' వాడేలే చిత్రానకి సంబంధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ. 3 కోట్లు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్ల షేర్ వసూలు చేసినప్పటికీ హెవీ బడ్జెట్ కారణంగా కొంత నష్టాలు వచ్చినట్లు టాక్. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాని, ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం కొన్ని ఏరియాల్లో మూవీ అంతంతగానే కలెక్సన్స్ సాధించిందనే లెక్కలు తెలుస్తున్నాయి. ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ చరణ్ నటించారు. కొన్ని కారణాల విడిపోయిన తన కుటుంబ సభ్యులను కలపడానికి హీరో ఏం చేసాడు? అనే పాయింటుతో సాగిన స్టోరీకి ఫ్యామిలీ అనుబంధాలు, ఆప్యాయతలు, ఎమోషన్స్, బావామరదళ్ల సరసాలు యాడ్ చేసి వినోదాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణ వంశీ. రామ్ చరణ్ నటించిన తొలి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. అయినా బాక్సాపీస్ ని షేక్ చేయలేకపోయింది. ఈ మూవీని ద్రుష్టిలో పెట్టుకొని నిర్మాతలను సేఫ్ జోన్ లో తీసుకుపోవటానికి తన అప్ కమింగ్ మూవీలో రామ్ చరణ్ కొన్ని షరతులతో కూడిన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నాడు. అంటే తను తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ కంటే కొద్దిగా తక్కవ తీసుకుంటాడు. మూవీ లాబాల బాట పట్టిందంటే తనకు రావాల్సి ఆ బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ని నిర్మాత తిరిగి చెల్లించాలి. లేదంటే అంతా మామూలే. దీని వల్ల నిర్మాతకి కొంత ఆర్ధిక భారం తగ్గుతుంది. రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మిగతా హీరోలు కూడ దీన్నే ఫాలో అయితే బాగుంటుందని మరి కొందరి నిర్మాతల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: