ఇప్పటి వరకూ మెగా కాంపౌండ్ నుండి హీరోలు మాత్రమే ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ వస్తున్నారు. ఇక నుండి ఈ కాంపౌండ్ నుండి నిర్మాతలు కూడ బయటకు రాబోతున్నారు. అందులోనూ ఫిమేల్ ప్రొడ్యూజర్స్. అవును త్వరలోనే మెగా కుటుంబం నుండి మెగా హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న హీరో కూతురు, ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నారు. మేటర్ లోకి వెళితే, ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక ఇపుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త సెల్రబిటీ. నాగాబాబు కుమార్తె నిహారిక, హీరోయిన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుందని అందరూ గెస్ చేస్తే, దానికి భిన్నంగా తన వ్యవహారం తెరపైకి వస్తుంది. ఎవరూ ఊహించని విధంగా 'ఢీ'-7 యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. తనదైన యాకరింగుతో, బబ్లీ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులు, అభిమానులు నిహారిక సూపర్ అంటూ కితాబిస్తున్నారు. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే వచ్చారు. అయితే, నిహారికా యంకరింగ్ చేస్తుంది కదా అని, హీరోయిన్ గా వచ్చే అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. కాని నిహారికా మాత్రం కచ్ఛితంగా నిర్మాతగా మారాతానంటూ సన్నిహితులలో చెప్పుకుంటుంది. ఇప్పటికే ఢీ-7 కి సంబంధించిన ప్రొడక్షన్ బాధ్యతలను తీసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. తన తండ్రి బ్యానర్ లో తను సక్సెస్ ఫుల్ మూవీలను తీయాలని నిహారిక కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాదిరి నిహారిక బుల్లితెర నుండి మొదలు పెట్టి వెండి తెర వైపు అడుగులు వేసే దిశగా తన ప్రయాణం కొనసాగించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: