వరస పెట్టి సినిమాలలో అవకాశాలు వస్తు ఉండటంతో శ్రుతిహాసన్ కు మీడియా ముందు తానేమి మాట్లుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందా అనే అనుమానం కలిగేదట్లుగా ఆమె ప్రవర్తన ఉంటోంది. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ చేసిన వింత వ్యాఖ్యలు ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. సినిమాల పై విమర్శలు చేసే విమర్శకులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఆమె సినిమా చూసి విమర్శించినంత తేలిక కాదు అని అంటూ ఒకపాత్రలో ఇన్వాల్వ్ అయి చాల గ్లామరస్ గా కనిపిస్తే అ పాత్రలో అంత ఘాటుగా చేయల అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని, ఒకవేళ చేస్తున్న పాత్రలో పద్ధతిగా కనిపిస్తే ఆ పాత్ర ఇంకా మోడర్న్‌గా ఉంటే బాగుంటుంది అంటూ ఎవ్వరుకు తోచిన వ్యాఖ్యలు వారు రాసేస్తున్నారని గగ్గోలు పెడుతోంది శ్రుతిహాసన్. తాను సినిమాలో గ్లామరస్ పాత్రలో హాట్ గా కనిపించినప్పుడు తన శరీరం అందచందాల పై ఏవేవో రాతలు రాస్తున్నారని అంటూ తన అందాన్ని చూసే ఎదుటి వ్యక్తి మనసులో ఏమీ లేనప్పుడు అటువంటి బూతు పదాలు ఎందుకు వస్తాయని ప్రశ్నిస్తోంది శ్రుతిహాసన్. అంతేకాదు తన శరీరాన్ని ఒక గుడిగా పోల్చుకుంటూ దేవాలయానికి వెళ్ళినప్పుడు కొంతమంది దేవాలయం పై ఉన్న బూతు శిల్పాలను చూస్తే మరి కొందరు పవిత్రమైన భావంతో దేవుడ్ని చూస్తారని అంటూ తన పై గాలి వార్తలు, విమర్శలు రాసే వారిని పట్టించుకోను అంటూ మీడియా పై ఎదురు దాడి చేస్తోంది శ్రుతిహాసన్..  

మరింత సమాచారం తెలుసుకోండి: