సామాన్య ప్రజానీకానికే కాదు సెలెబ్రెటీల కుటుంబాలకు కూడా గూండా గిరి నుండి సమస్యలు తప్పడంలేదు అనే విషయానికి మరొక ఉదాహరణగా సినీనటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌ పై ఎమ్మెల్యే అనుచరులు దురుసుగా ప్రవర్తించి దాడిచేసారు అనే వార్తలు వెబ్ మీడియాలో వస్తున్నాయి.  వస్తున్న వార్తల ప్రకారం ఔటర్‌ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద సంజయ్ పై ఈదాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో యాక్టర్ బ్రహ్మజీ కుమారుడికి గాయాలు అయ్యాయి అనే వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న వార్తల ప్రకారం విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్రహ్మాజీని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆయన కొడుకు సంజయ్‌కుమార్ తన కారులో ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది అని అంటున్నారు.  శంషాబాద్ సమీపంలోకి కిషన్‌గూడ టోల్‌గేట్ వద్ద సంజయ్ టికెట్ తీసుకుంటున్న సందర్భంలో వెనుకనేవున్న ఎమ్మెల్యే వాహన డ్రైవర్ కంటిన్యూగా హారన్ కొట్టడంతో కారుదిగిన సంజయ్ ఎమ్మెల్యే వాహనం వద్దకు వచ్చి వాదనకు దిగాడు అని టాక్. దీనితో కోపగించిన ఆ ఎమ్మెల్యే తాలూకు కొందరు వ్యక్తులు సంజయ్ ముఖం పై కొట్టడంతో అతని ముక్కులోంచి రక్తం వచ్చిందట.  అయితే తరువాత ఈ వార్తను తెలుసుకున్న పోలీస్ వర్గాలు ఎమ్మెల్యే మద్దతుదారులు, నటుడు బ్రహ్మాజీకుమారిడి మధ్య రాజి కుదిర్చినట్లు తెలుస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: