టాలీవుడ్ ను మెగా స్టార్ గా ఏక చత్రాధిపత్యంగా రెండు దశాబ్దాలు ఏలిన చిరంజీవి రాజకీయాలలోకి వచ్చిన తరువాత తన ప్రభావాన్ని కోల్పోవడంతో లేని గాంభీర్యాన్ని నటిస్తూ ఒకోసారి బహిరంగ వేదికల పై చేస్తున్న ఉపన్యాసాలు సెటైర్లకు కేంద్రంగా మారుతోంది. ఆమధ్య చిరంజీవి, రామ్ చరణ్ లు ఎన్నో ఆసలు పెట్టుకున్న ‘గోవిందుడు అందరివాడెలే’ ఆడియో వేడుక మెగా అభిమానుల మధ్య అత్యంత ఘనంగా జరిగినప్పుడు మెగా అభిమానులు ‘పవన్ పవన్’ అంటూ నామస్మరణ చేస్తూ చిరంజీవి ఉపన్యాసానికి అడ్డు తగిలినప్పుడు చిరంజీవి అసహనంతో పవన్ ఈ సినిమా శతదినోత్సవ సభకు వస్తాడు అంటూ అప్పటికి ఆ విషయాన్ని చల్లార్చాడు.  దసరాకు విడుదలైన ఈ సినిమా మంచి రివ్యూలు తెచ్చుకున్నా బాక్స్ ఆఫీసు ముందు నిలబడలేక పోవడంతో ఈ సినిమా అర్ధ శతదినోత్సవం ఇరు రాష్ట్రాలలోను 7 సెంటర్ల లో మాత్రమే ఈ వారంలో జరగబోతోంది. దీనితో అసలు ఈ సినిమాకు శతదినోత్సవం జరుపుకునే అవకాసం ఉండని నేపధ్యంలో జరగని శతదినోత్సవ సభకు పవన్ ఎక్కడనుంచి వస్తాడు అంటూ కొందరు చిరంజీవి మాటలను గుర్తుకు చేస్తూ చిరంజీవి పై వెబ్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.  ఒక వైపు తన 150వ సినిమా గురించి ధైర్యం చేయలేని పరిస్థితి మరో ప్రక్క అగమ్యగోచరంగా ఉన్న రాజకీయ భవిష్యత్ ల మధ్య చిరంజీవి తన ప్రత్యర్ధులకు వెబ్ మీడియా సాక్షిగా సెటైర్లు వేసుకునే వ్యక్తిగా మారడం దురదృష్టం అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: