పవన్ కళ్యాణ్ కు నచ్చని సినిమా గురించి జూనియర్ అల్లుఅర్జున్ లు ప్రయత్నిస్తున్నారు అనే వార్తలతో ఫిలింనగర్ లో హడావిడి కనిపిస్తోంది. మొన్న దీపావళికి వచ్చి కేవలం 15 రోజులలో 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా కోలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసిన కత్తి సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తాడు అనే వార్తలు కొద్దిరోజులు హడావిడి చేసాయి. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కొనుక్కున్న ఠాగూర్ మధు ఎంత నచ్చ చెప్పినా ఈ సినిమా రీమేక్ లో నటించడానికి పవన్ అంగీకరించక పోవడంతో ఈ సినిమా డబ్బింగ్ ఈ నెలాఖరు లోపు టాలీవుడ్ లో విడుదల అవుతుంది అనుకున్నారు అంతా.  అయితే ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకుని ఈ నెలాఖరున విడుదల కావడం కష్టమే అని అంటున్నారు. దీనికి కారణం ఈ సినిమా రీమేక్ లో నటిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనల మధ్య అటు జూనియర్ ఇటు అల్లుఅర్జున్ చాల బిజీగా ఉన్నారు అని టాక్.  ఈ సినిమా రీమేక్ లో తాము నటిస్తే బాగుంటుందా? అనే విషయమై జూనియర్, బన్నీలు తమ సన్నిహితుల సలహాలను అడగటమే కాకుండా ఈ సినిమాకు ఎవరి దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంది అనే విషయం పై అభిప్రాయ సేకరణ కూడా మొదలు పెట్టినట్లు టాక్. దీనితో ఈ విషయమై ఒక క్లారిటీ వచ్చే దాకా ఈ ‘కత్తి’ విడుదల మరో రొండు వారాలు వాయిదా పడింది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి..    

మరింత సమాచారం తెలుసుకోండి: