ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త కథలు రూపుదాల్చుతున్నాయి. ముఖ్యంగా సినిమా కథలు మాని, సెలబ్రిటీల జీవిత చరిత్రలను, వారు సాధించిన విజయాలను మూవీలగా రూపొందించడం మొదలు పెడుతున్నారు. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీ సరికొత్త పుంతలు తొక్కుతుంది. తాజాగా సిల్క్ స్మిత బయోగ్రఫీ పై చేసిన సినిమా పెద్ద హిట్ అయ్యింది. అలాగే హాకీ సెలబ్రిటీ మిల్కా సింగ్, బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ ఇలా ఎన్నో చిత్రాలు ఈ కోవలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మీర్జా రియల్ లైఫ్ మీద కూడా సినిమా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఫిల్మ్ మేకర్స్ సానియా మీర్జా లైఫ్ పై సినిమా తియ్యాలని ట్రై చేసారు. వారికి సానియా మీర్జా సమాధానం ఇస్తూ ‘నా పర్సనల్ లైఫ్ లోని విషయాలను షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే నా లైఫ్ పై సినిమా తీయడంపై నాకు పెద్ద ఆసక్తి లేదని’ తెలిపింది. అయితే ఓ కార్పోరేట్ సంస్థ సానియా మీర్జా పై మూవీని తీయటానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తను ఈ మూవీకి ఒప్పుకుంటే భారీ మొత్తంలో రైట్స్ కోసం రెమ్యునరేషన్ ని ఆఫర్ చేస్తున్నారని బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సానిమా మీర్జా గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ మాత్రమే కాకుండా, సూపర్ గ్లామర్ ప్లేయర్ కూడ కావడంతో ఈ మూవీకి మరింత పబ్లిసిటీ చేకూరే అవకాశం ఉంది. అందుకే తన మూవీని సానియా మీర్జా తిరస్కరిస్తూనే, మరో వైపు తన మూవీకి స్టార్ కాస్టింగ్ ఎవరైతే బాగుంటుందో వివరిస్తుంది. ‘ఒకవేళ భవిష్యత్తులో నేను తీసుకున్న ఈ విషయంలో మార్పు ఉండొచ్చు. నా పరంగా సిల్వర్ స్క్రీన్ పై నా పాత్ర చేయడానికి దీపిక పడుకొనే బాగుంటుందని’ సానియా మీర్జా చెప్పింది. దీన్ని బట్టి చూసుకుంటే సానియా మీర్జా జీవితంపై తీసే సినిమా ముందు ముందు వచ్చే అవకాశం ఉంది. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే సానిమా మీర్జాపై మూవీని తీసేందుకు ప్రి ప్రొడక్షన్ పనులను ఓ సంస్థ స్టార్ట్ చేసిందనే టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: