అలనాటి టాప్ హీరోయిన్స్ శ్రీదేవి జయప్రద రమ్యకృష్ణల నుంచి నేటి తరం తాప్సీ వరకు హీరోయిన్స్ ను అత్యంత హాట్ గా చూపెట్టడంలో రాఘవేంద్రరావుకు మించిన ఘనుడు టాలీవుడ్ లో మరెవ్వరూ లేరు. అటువంటి దర్శకేంద్రుడు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో సంచలనంగా మారిన రకుల్ ప్రీత్ చాల హాట్ అంటూ ఓపెన్ గా కామెంట్స్ చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు.  ఈ పొగడ్తలు విన్న రకుల్ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ తన ఆనందాన్ని దాచుకుంది. నిన్న జరిగిన ‘లౌక్యం' 50 రోజుల వేడుకలలో అతిధిగా పాల్గొన్నరాఘవేంద్రరావు ఈసినిమా హీరో గోపీచంద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత వెరీ హాట్ అంటూ ఆమెను కూడా ఆకాశానికి ఎత్తేశాడు రాఘవేంద్రరావు.  ఇటువంటి లెజండరీ దర్శకుల దృష్టిలో పడటం వల్ల కాబోలు నేటి యంగ్ హీరోలకు అదృష్ట లక్షిగా మారిన రకుల్ ను చూసి సమంతా, కాజల్, తమన్నాలు భయపడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ప్రస్తుతం 6 సినిమాలలో నటిస్తూ రకుల్ క్షణం తీరిక లేకుండా టాప్ యంగ్ హీరోలతో నటించే అవకాశం గురించి ఎదురు చూస్తోంది అనే వార్తలు ఉన్నాయి. ఏమైనా ఈ సంవత్సరపు లక్కీ హీరోయిన్ గా రకుల్ ప్రీతీ రికార్డులు క్రియేట్ చేస్తోంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: