పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓ మూవీకి సంబంధించిన కథని రిమేక్ చేయాలని ప్రివ్యూని సైతం చూశాడు. తీరా ఆ మూవీని చూసిన తరువాత ఆ ఫిల్మ్ ని రిమేక్ చేసే ఉద్ధేశం లేదని తేల్చేశాడు. అయితే ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఉత్సాహం కన్నా, ఇతర వ్యక్తుల అత్యుత్సాహం ఎక్కువుగా ఉంది. ఇదంతా రీసెంట్ గా కోలీవుడ్ లో రిలీజ్ అయిన కత్తి మూవీ విషయంలో జరిగింది. మేటర్ లోకి వెళితే, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కత్తి’ చిత్రం రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కూడ దాదాపు అవును అంటూ క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ గోవాలో తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ లో ఉన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2015 సంక్రాంతిలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కత్తి రిమేక్ లో నటించటానికి జూనియర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొదట పవన్ కళ్యాణ్ హీరోగా ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నిర్మాత ఠాగూర్ మధు ప్రయత్నించారు. పవన్ ఆసక్తి చూపకపోవడంతో ఈ నెల 21న డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ప్రస్తుతంక దీనికి విడుదల డైలమాలో పడింది. తమిళంలో సుమారు 100 కోట్లు వసూలు చేసిన కత్తి చిత్రంను, తెలుగులో జూనియర్ రిమేక్ చేయటానకి ఆసక్తి చూపుతున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జూనియర్ నటించిన ఏ మూవీలు కథా పరంగా బలంగా లేదు. మంచి స్టోరి ఉన్న కత్తి మూవీని ఇప్పుడు తెలుగులో బాగుంటుందని జూనియర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇళయ దళపతి విజయ్, సమంత జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కత్తి’, దీపావళి కానుకగా తమిళనాడులో విడుదలైంది. ప్రస్తుతం రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను, కార్పొరేట్ కంపెనీల ఆగడాలను ఈ చిత్రంలో ప్రస్తావించారు. మొత్తంగా కత్తి తెలుగు రిమేక్ పై త్వరలోనే ఓ నిర్ణయం బయటకు రానుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: