సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని కొనసాగిస్తున్న బ్యూటీ, అనుష్క. అనుష్క ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. ముఖ్యంగా అనుష్క నటిస్తున్న మూవీలు అన్నీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాపీస్ ని షేక్ చేసేవే కావడంతో, ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాలపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే అనుష్క తను నటిస్తున్న ఫిల్మ్స్ లో కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా, తన పాత్రకు తగ్గ ప్రాముఖ్యత కోసం ఎంతటి రిస్క్ షాట్స్ అయినా చేస్తుంది. ప్రస్తుతం అనుష్క చేస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా కోసం అనుష్క మరో రేర్ ఫీట్ చేసింది. అనుష్క రుద్రమదేవి సినిమాలో లేడీ వారియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అనుష్క కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు, పోరాట సన్నివేశాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అంతే కాకుండా రుద్రమదేవి మూవీ కోసం రియల్ స్టంట్స్ ని సైతం, ధైర్యంగా చేస్తుంది. తాజాగా తను ఎంతో రిస్క్ చేసి 150 అడుగుల ఎత్తులో ఓ స్టంట్ ని చేసింది. చాలా మంది ఈ స్టంట్ కి డూప్ అవసరం అని అనుష్కకి ఎంత చెప్పినా, తను వినిపించుకోలేదంట. కచ్ఛితంగా తను మాత్రమే ఆ స్టంట్ చేస్తే, మూవీకి ఎంతో రిచ్ గా ఉంటుందని, సీన్ బాగుంటుందని భావించి, ఈ సాహసం చేసినట్టు చిత్ర యూనిట్ నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. దాంతో అనుష్క చేసిన స్టంట్ ని చూసి, చిత్ర యూనిట్ షాక్ కి గురయ్యారు. దాదాపు 150 అడుగుల ఎత్తులో వేలాడుతూ రిస్కీ స్టంట్ చేసిందని రుద్రమదేవి టీం అంటోంది. మొత్తానికి రుద్రమదేవి మూవీ కోసం అనుష్క హీరోలను మించిన రిస్కీ షాట్స్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: