మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం పిల్లా నువ్వులేని జీవితం. ఈ మూవీకి సంబంధించి మొదటి వారం కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. దీంతో సాయి ధరమ్ తేజ్ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. అయితే రీసెంట్ గా బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ సిల్వర్ స్రీన్ కి ఎంట్రి ఇచ్చిన మూవీ, అల్లుడు శ్రీను మూవీ బాక్సాపీస్ తో పోల్చుకుంటే ఈ "పిల్లా నువ్వు లేని జీవితం" మూవీకి వచ్చిన రెస్పాన్స్ చాలా తక్కువనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోగా సాయి ధరమ్ తేజ్ పబ్లిసిటీని సంపాదించుకున్నప్పటికీ, తను నటించిన "పిల్లా నువ్వు లేని జీవితం" మూవీకి బాక్సాపీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని తెచ్చుకోలేకపోయాడు. కాని హీరోగా పాజిటివ్ మార్కులని సంపాదించుకున్నాడు. మేటర్ లోకి వెళితే "పిల్లా నువ్వు లేని జీవితం" మూవీకి సంబంధించిన మొదటి వారం బాక్సాపీస్ వివరాలు బయటకు వచ్చాయి. ట్రేడ్ రిపోర్ట్స్ నుండి అందిన సమాచారం మేరకు "పిల్లా నువ్వు లేని జీవితం" మూవీకి మొదటి వారం కలెక్షన్స్ దాదాపు 5 కోట్ల రూపాయలను టచ్ చేసింది. ఈ మూవీ ఇప్పటి వరకూ నైజాంలో 2.01 కోట్ల రూపాయలను, సీడెడ్ లో 0.95 కోట్ల రూపాయలను, ఓవర్సీస్ లో 58 లక్షలు, గుంటూరు లో 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 39 లక్షలు, వెస్ట్ గోదావరి లో 28.39 లక్షలు, క్రిష్ణా జిల్లాలో 35.50 లక్షలు, నెల్లూరులో 16.7 లక్షలు, మొత్తంగా 5.18 కోట్ల రూపాయలతో మొదటి వారం కలెక్షన్స్ ని తెచ్చుకోగలిగింది. మూవీకి పెట్టిన పెట్టుబడిలో దాదాపు 50 శాతం వరకూ రికవరీ అయినట్టుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: