టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా హీరోల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే ఎంత మంది వచ్చినా, వీరందరూ తమకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్ డం ని అభిమానుల నుండి తెచ్చుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ తన మూవీలో ఏ విధమైన యాక్టర్స్ సెలక్షన్స్ చేస్తాడో, ఇప్పుడు అదే విధంగా రామ్ చరణ్ కూడ ఫాలో అవుతున్నాడు. మేటర్ లోకి వెళితే, బాలీవుడ్ యాక్టర్ బోమన్ ఇరానీను రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీలో తీసుకోవాటినకి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ లో బిజీగా ఉంటూ కూడా బొమన్ ఇరానీ తెలుగులో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించాడు. తను చేసింది చాలా చిన్న పాత్రే అయినప్పటికీ సినిమాలో ఆ పాత్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండడంతో బొమన్ ఇరానీకి మంచి పేరు వచ్చింది. దాంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై బోమన్ ఇరానీ ప్రత్యేకమైన ఆశక్తి కలిగింది. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ పై, అలాగే పవన్ కళ్యాణ్ పై. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘అత్తారింటికి దారేది షూటింగ్ టైంలో నేను త్రివిక్రమ్ ఎక్కువగా సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. త్రివిక్రమ్ తెలుగు సినిమా ఎన్ సైక్లోపీడియా. అలాగే అతనికి ఫారిన్ సినిమాల గురించి కూడా బాగా తెలుసు అందుకే మేమిద్దరం బాగా చర్చించుకునే వాళ్ళమని’ అన్నాడు. అలాగే తన రాబోయే సినిమా గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం రెండు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాను’ అన్నాడు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు, రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ ఏదైనా, అందులో బోమన్ ఇరానీ పాత్ర ఉండాల్సిందే అని, తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: