ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శంకర్ ది సపరేట్ టాపిక్. ఎందుకంటే అందరి డైరెక్టర్స్ లా శంకర్ ఉండడు. ఎక్కువ మూవీల కోసం తొందరపడే రకం అస్సలే కాదు. నచ్చిన మూవీని బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ చేసేదాకా, ఎటువంటి రాజీలు లేకుండా మూవీని తెరకెక్కిస్తాడు. అయితే శంకర్ ఇంత కాలం తను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ విధమైన పేరుని సంపాదించుకున్నాడో అది ఒక ఎత్తైతే, ఇప్పుడు తను తీసిన అప్ కమింగ్ ఐ ఫిల్మ్ ని సక్సెస్ చేయడం ఒక ఎత్తు. జెంటిల్ మెన్ మూవీ కోసం శంకర్ ఏ విధంగా హార్డ్ వర్క్ చేశాడో, దానికి మించిన హార్డ్ ఐ మూవీ అంటూ శంకర్ పలుసార్లు చెప్పుకొచ్చాడు. “అంతే కాకుండా తను ఐ మూవీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త విషయాలను ఎన్నో నేర్చుకున్నాను. నిజానికి ఐ మూవీ నాకు మొదటి అవుతుందని చెప్పుకోవాలి. ఐ మూవీ చేయలేకపోతే, నేను దర్శకుడిగా వెనకబడిపోయి ఉండేవాడినని” అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఐ మూవీని ప్రమోట్ చేయడంలోనూ, బిజినెస్ చేయించడంలోనూ శంకర్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఐ మూవీకి సంబంధించిన హిందీ బిజినెస్ దాదాపు 20 కోట్ల రూపాయలు టచ్ అయిందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓ సౌత్ మూవీకి బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 20 కోట్ల రూపాయల ప్రి-రిలీజ్డ్ బిజినెస్ కావడం ఇదే మొదటిసారి. విక్రమ్, అమీ జాక్సన్ లు జంటగా నటించిన ‘ఐ’ సినిమా బిజినెస్ ఆంద్రప్రదేశ్ లో డైరెక్ట్ తెలుగు సినిమాలనూ తలదన్నే రీతిలో జరుగుతుంది. ఈ చిత్ర హిందీ వెర్షన్ హక్కులు సైతం ఇదే రీతిలో బిజినెస్ చేస్తున్నాయి. బాలీవుడ్ నటి రవీనా టాండన్ భర్త, ప్రముఖ డిస్త్రిబ్యుటర్ అనీల్ తాదాని హిందీహక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది ‘ఐ’ సినిమా గ్రాఫికల్ మాయాజాలంగా తెరకెక్కుతుంది. ఇందులో విక్రమ్ పోషించిన బీస్ట్ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది. ఏ.ఆర్ రెహమాన్ ఈ మూవీకి ఇచ్చిన ఆర్.ఆర్ సూపర్ అంటూ పోస్ట్ ప్రొడక్షన్ రిపోర్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: