వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబుతో తీయబోతున్న సినిమా టైటిల్ మహేష్ బాబు అభిమానులకు టెన్షన్ గా మారింది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం రామ్ గోపాల్ వర్మ తనతో ‘ఐస్ క్రీమ్’ సినిమాను తీసిన భీమవరం టాకీస్ ప్రొడక్షన్స్ నిర్మాతలకు తీయబోతున్న ‘పోకిరి రిటర్న్స్’ సినిమాకు హీరోగా సంపూ బాబును ఎంపిక చేసినట్లు వార్తలు రావడం. అంతేకాదు ఈ సినిమాలోని సంపూ పాత్ర పేరు పండుగాడు గా నిర్ణయించడంతో మహేష్ ను సూపర్ స్టార్ గా మార్చిన ‘పోకిరి’ సినిమాకు సెటైర్ గా ఈసినిమా ఉండబోతోండా ? అనే భయం మహేష్ అభిమానులను పీడిస్తోంది అని టాక్. ఇప్పటికే రిజిస్టర్ చేయబడ్డ ఈ సినిమా టైటిల్ సంపూ తో నిర్మాణం జరుపుకుంటే ప్రస్తుతం సంపూ బాబుకు ఉన్న క్రేజ్ మరియు ఈ టైటిల్ మ్యానియాతో ప్రారంభం కాకుండానే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం వర్మ తీస్తున్న సినిమాలలో కథ లేకపోయినా కేవలం టైటిల్ క్రేజ్ తో హడావిడి చేస్తున్న నేపధ్యంలో వర్మ తీయబోతున్న ఈసినిమా కూడా కేవలం టైటిల్ హడావిడికే పరిమితం అవుతుందా? లేదంటే మహేష్ ‘పోకిరి’ సినిమాకు నిజమైన సెటైర్ గా మారుతుందా అనే అయోమయంలో మహేష్ అభిమానులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ‘పోకిరి’ కి సీక్వెల్ గా ‘పోకిరి రిటర్న్స్’ అని టైటిల్ పెట్టి సినిమా తీద్దాము అనుకున్న పూరి జగన్నాథ్ కు కూడా వర్మ చేయబోతున్న ప్రయోగం షాకింగ్ గా మారింది అనే వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: