బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ ప్రభుదేవా. రిమేక్ మూవీలకి కేరాఫ్ అడ్రస్ మారిన ప్రభుదేవా, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ కి డైరెక్షన్ చేశాడు. అంతే కాకుండా ఇప్పుడు తన దర్శకత్వంలో వస్తున్న మూవీలకి ఇండియన్ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ప్రభుదేవా ఏం చేసినా బిటౌన్ లో సంచలనమే. ఇదిలా ఉంటే ఇలాంటి స్టార్ డైరెక్టర్ కి ఓ స్టార్ హీరో వార్నింగ్ ఇచ్చాడు. అలా వార్నింగ్ ఇచ్చిన హీరో ఎవరో కాదు. తన దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ యాక్షన్ జాక్సన్ మూవీలో నటించిన హీరో అజయ్ దేవగన్. అవును, స్టార్ హీరో అజయ్ దేవగన్, ప్రభుదేవాకి వార్నింగ్ ఇచ్చినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళితే అజయ్ దేవగన్ హీరోగా రాబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ యాక్షన్ జాక్సన్ కి ‘ప్రోమో’కష్టాలు వచ్చిపడ్డాయి. ఎలాంటి యాక్షన్ సినిమాల్లోనైనా నటించడమే చాలా తేలికని, సినిమాల ప్రోమోల్లో పాల్గొనడం కష్టమని అంటున్నాడు. ‘యాక్షన్ జాక్సన్’ ప్రోమో కోసం వెళ్లిన చోటల్లా రోజంతా మీడియా ఇంటర్వ్యూలతో గడుపుతున్న అజయ్ దేవ్‌గణ్, ఈ వ్యవహారంతో విసుగెత్తినట్లే కనిపిస్తున్నాడు. ప్రతిచోటా అవే ప్రశ్నలకు, అవే సమాధానాలిస్తూ ప్రోమోల్లో పాల్గొనడం కంటే, నటించడమే సులువని మీడియా ఎదుటే చెప్సేశాడు. అయితే ప్రభుదేవా మాత్రం అజయ్ దేవగన్ ని యాక్షన్ జాక్సన్ మూవీ ప్రమోషన్ కోసం మరికొన్ని రోజులు తన షెడ్యూల్ ని పొడిగించమన్నాడు. దీంతో పూర్తిగా విసుగు చెందిన ఈ హీరో, గత రాత్రి ప్రభుదేవాకి స్వయంగా ఫోన్ చేసి, ఇక ప్రమోషన్ నా వల్ల కాదంటూ చేతులెత్తేశాడంట. అంతే కాకుండా ఏ మాత్రం రెస్ట్ లేకుండా నేను ప్రమోషన్ కి వెళ్ళలేను. మరో వారం రోజుల పాటు తనని ఏ మాత్రం డిస్ట్రబ్ చేసినా బాగుండదని చాలా క్లియర్ గా చెప్పాడంట. మూవీ రిలీజ్ కి మూడు రోజులు ముందు మాత్రమే తను ప్రమోషన్స్ లో పాల్గొంటానని చెప్పడంతో ఈ సారి ప్రభుదేవా షాక్ అయ్యాడంటూ బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 5 న రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: