నిన్న ‘గోపాల గోపాల’ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఎట్టి పరిస్తుతులలోను పవన్, వెంకటేష్ లు నటిస్తున్న గోపాలుడి సినిమా రిలీజ్ ఖాయం అని తన ట్విటర్ లో అధికారికంగా ప్రకటించడమే కాకుండా ఈ సినిమా ఆడియో వేడుక వచ్చే నెల జరగబోతోంది అనే క్లారిటీ ఇచ్చాడు. అయితే దీనితో ‘గోపాల గోపాల’ సినిమా విషయం పై క్లారిటీ వచ్చింది.  ఇక పోతే ఇదే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని వరుణ్ తేజ్ ‘ముకుందా’, అల్లుఅర్జున్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ విడుదల కావడం కూడా ఖాయం అనే మాటలు విశ్వసనీయంగా వినిపిస్తున్నాయి. అయితే పవన్ లాంటి టాలీవుడ్ ఎంపరర్ ను ఎదుర్కునే సాహసం ఈ రెండు సినిమాలలో నటిస్తున్న మెగా హీరోలకు ఉన్నదా? అనే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. కనీసం రెండువారాల గ్యాప్ లేకుండా ఒకే మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోల భారీ సినిమాలు ఒకేసారి ఒకేనెలలో విడుదల అవ్వుతాయి అని వార్తలు రావడం వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నది అనే వార్తలు కూడా వినిపుస్తున్నాయి.  పవన్‌కళ్యాణ్‌తో ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి సత్సంబంధాలు లేవనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని పసిగట్టి మెగా కుటుంబం మధ్య మరింత రచ్చ క్రియేట్ చేయడానికి కావాలనే కొందరు మెగా కుటుంబ వ్యతిరేకులు మెగా కుటంబ హీరోల అభిమానులలో అయోమయం సృష్టించడానికి కావాలని యిలా గాసిప్పులు సృష్టిస్తున్నారని కొoదరి వాదన.  అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో కలిపి మెగా కుటుంబంలోని హీరోల సంఖ్య 7కు చేరిపోవడంతో వీరి సినిమాలలో ఒకరి పై ఒకరు పోటీగా విడుదలయ్యే పరిస్థుతులు రానున్న సంక్రాంతికి లేకపోయినా ఎదో ఒక సందర్భంలో అని వార్య పరిస్థుతులలో టాలీవుడ్ లో మెగా హీరోల సినిమాల మధ్య మెగా వార్ జరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ ఒక వర్గం వారు విశ్లేషణలు చేస్తున్నారు.  ఇలాంటి పరిస్థుతులలో రాబోతున్న సంక్రాంతిని మెగా హీరోలు అంతా కలిపి పవన్ కు మాత్రమే వదిలేస్తారా? లేదంటే వస్తున్న వార్తల ప్రకారం మెగా వార్ కు తెర లేపుతారా అనే విషయం పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: