150 సినిమాలు తీసి ఆ సినిమాలలో ఎన్నో శతదినోత్సవాలు మరెన్నో రజితోత్సవాలు జరుపుకున్న దాసరి సినిమాల పరిస్థితి ఇక ముగింపుకు వచ్చినట్లేనా అనే మాటలు వినిపిస్తున్నాయి. దాసరి ఎంతో పట్టుదలతో హిట్ కోడదామన్న కసితో తీసిన ‘ఎర్ర బస్సు’ సినిమాకు అమెరికాలో జరిగిన పరాభవం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  దాసరి సినిమాలు ఇప్పటి వరకు అమెరికాలో విడుదలైన సందర్భాలు గతంలో లేకపోవడంతో చాల మంది దర్శకులలా అమెరికాలో కూడా తన ‘ఎర్ర బస్సు’ హవా చూపుదామని చేసిన ప్రయోగం వికటించి మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమంచారం మేరకు గత శుక్రువారం అమెరికాలో 27 ధియేటర్లలో విడుదలైన ‘ఎర్ర బస్సు’ సినిమా ప్రదర్శిస్తున్న 17 ధియేటర్లలో ఆ సినిమాను చూడటానికి ఒక్క ప్రేక్షకుడు కూడా ధియేటర్లలోకి రాలేదు అనే వార్తలు షాకింగ్ గా మారాయి. మిగిలిన 10 ధియేటర్లలో అతి కొద్దిగా జనం కనిపించినా ఆ వ్యక్తులు కూడా ఈ సినిమా పంపిణిదార్లకు చెందిన కుటుంబ ససభ్యులుగా మారడంతో ఈమధ్య కాలంలో అమెరికాలో విడుదలైన ఏ తెలుగు సినిమాకు రాని అత్యల్పమైన కలెక్షన్స్ రాబట్టుకుని దాసరి ‘ఎర్ర బస్సు’ దాసరికి మరిచిపోలేని పీడకలగా మారిందని వార్తలు వస్తున్నాయి.  తెలుగు వారి ఇరు రాష్ట్రాలలోను కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండటంతో దాసరి ‘ఎర్ర బస్సు’ మూడవ వారం పోస్టర్ చూస్తుందా అనే సెటైర్లు వినపడుతున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: