సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ముందు ప్రిన్స్ మహేష్ బాబు ఏ విషయంలోనూ సరితూగడు. అయితే మహేష్ తన సినిమాలకు సంబంధించి అందుకున్న ఒక రికార్డును రజినీకాంత్ చేరుకోలేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రజినీ నటించిన ‘లింగ’ సినిమాను ‘ఈరోస్’ సంస్థ 165 కోట్లకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా హక్కులను తీసుకుని సంచలనం సృస్టించిన విషయం తెలిసిందే.  అయితే ఇంత గొప్ప మార్కెట్ ను సృష్టించుకున్న ‘లింగ’ సినిమా తమిళ, తెలుగు భాషలకు సంబంధించి ఓవర్సీస్ రైట్లు 8 కోట్ల 40 లక్షలకు అమ్ముడి పోయినట్లు వార్తలు వస్తున్నాయి. రజినీకాంత్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో అత్యధిక ఓవర్సీస్ బిజినెస్ చేసిన సినిమా ఇదే అంటున్నారు.  అయితే రజినీ క్రేజ్ లో కనీసం పావు వంతు కూడాలేని మహేష్ నటించిన ‘ఆగడు’ సినిమా ఓవర్సీస్ బిజినెస్ గతం లో 9 కోట్ల వరకు జరిగింది అనే వార్తలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలలో అభిమానులు ఉన్న రజినీ ‘లింగ’ ఓవర్సీస్ బిజినెస్ మహేష్ ‘ఆగడు’ స్థాయిని కూడా దాటలేకపోవడం చూస్తూ ఉంటే దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి ఓవర్సీస్ కింగ్ గా మహేష్ క్రియేట్ చేసిన రికార్డులను రజినీకాంత్ అందుకోలేక పోయాడు అనే వాదనను మహేష్ వీరాభిమానులు తెర పైకి తీసుకు వస్తున్నారు.  అయితే మహేష్ అభిమానులు లేవనెత్తుతున్న ఈ విషయం రజినీ ‘లింగ’ ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్ చేయబోతున్న కలెక్షన్స్ సునామి ముందు అత్యంత చిన్న విషయం అన్న వాస్తవం ఎవరికైనా అర్ధం అవుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: