వరుణ్ తేజ్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ముకుంద’ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ తరువాత బయటకు వచ్చిన స్టిల్స్ ఇవే కావడంతో మెగా అభిమానులు అత్యంత ఆశక్తితో ఈ స్టిల్స్ ను చూస్తున్నారు.  స్టైలిష్ గా నడుస్తున్న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను చూస్తూ ఉంటే ఇతడు కూడా సంచలనాలు క్రియేట్ చేస్తాడా అని అనిపించేడట్లుగా ఉన్నది ఈ స్టిల్.ఈ స్టిల్స్ తో ‘ముకుంద’ పై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాస్, మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చి దిద్దాడు అనే వార్తలు ఉన్నాయి.  గోదావరి అందాల నేపధ్యంలో ఒక యువ వాలీబాల్ ప్లేయర్ గా వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో ఒకేఒక్క నిముషం రామ్ చరణ్ ఈ సినిమాలో తళుక్కుమని మెరుస్తాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంటుందని ప్రచారం జరుగుతున్నా ‘గోపాల గోపాల’ తో ఢి కొట్టే సాహసాన్ని ఈ ముకుందుడు చేయగలుగుతాడా అన్న సందేహం అందరిలోనూ ఉంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: