అక్కినేని నాగార్జున నటవారసుడిగా టాలీవుడ్ ను ఏలుదామని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న నాగచైతన్య ఈనెల 23న తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్నాడు. అయితే ఈసారి చైతు తన అభిమానులకు ఎవ్వరు ఊహించని బహుమతి ఇవ్వడమే కాకుండా ఆ బహుమతి ద్వారా బుల్లితెర పై ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తున్నాడు నాగచైతన్య.  గత అక్టోబర్ లో విడుదలైన "ఒక లైలా కోసం" మూవీని ప్రీమియర్‌షోగా రాబోతున్న ఆదివారం మాటీవీ టెలికాస్ట్ చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పై చైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఊహించిన స్థాయిలో ఈ సినిమాకు స్పందన రాలేదు అన్న విషయం తెలిసిందే.  దీనితో ఈ సినిమా విడుదలైన కేవలం 35 రోజులలోనే బుల్లితెర పై ప్రీమియర్ షోగా టెలికాస్ట్ అవడం ఒక బుల్లి తెర రికార్డు అని అంటున్నారు. గతంలో విడుదలై  36 రోజుల తరువాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘శశిరేఖా పరిణియం’ బుల్లితెర పై టెలికాస్ట్ కాబడింది. ఇప్పుడు ఆ సినిమా రికార్డును నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ బ్రేక్ చేస్తోంది. లవర్ బాయ్ ఇమేజ్ నుండి మాస్ హీరోగా ఎదగాలి అనే తాపత్రయంతో నాగచైతన్య ప్రస్తుతం సుధీర్ వర్మ దర్సకత్వంలో నటిస్తున్న సినిమా తాలూకు ఫస్ట్ లుక్ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారు అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ‘దొరకడు’ అనే టైటిల్ నిశ్చయించినట్లు వార్తలు ఉన్నాయి. కనీసం ఈ సినిమా ద్వారా అయినా మాస్ పల్స్ ను అందుకునే హీరోగా నాగచైతన్య ఎదుగుతాడో లేదో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: