టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరు అంటే? అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది సమంతానే. అయితే హీరోయిన్స్ కేవలం గ్లామర్ కే పరిమితం కాదనే భావనలో ఉంటుంది సమంత. అందుకే కొన్ని మూవీలలో సమంత కేవలం గ్లామర్ కోసమే నటించినప్పటికీ, తరువాత మాత్రం ఆ ఆలోచనల నుండి పూర్తిగా తప్పుకుంటుంది. తను కూడ మూవీ సక్సెస్ లో భాగం అయ్యేవిధంగా ఉండే కథలని ఎంచుకుంటుంది. అందుకు తగ్గట్టుగా కథకి ఏం అవసరమో, అటువంటి విషయాలను చక్కగా నేర్చుకుంటుంది. ఆ విధంగానే సమంత ప్రస్తుతం గుర్రపు స్వారీని నేర్చుకుంటుంది. ప్రస్తుతం సమంత నేర్చుకుంటున్న ఈ గుర్రపు స్వారీనే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ శిక్షణ సినిమా కోసమా లేక సొంతంగా కలిగిన కోరికా? అని ఎవరైనా అడిగితే, కాదు కచ్ఛితంగా సినిమా కోసమే అని అంటుంది. ప్రస్తుతం సమంత, త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో రానున్న సినిమాలో సమంత లీడ్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ చేస్తున్నారు. అయితే అల్లుఅర్జున్ కి సంబంధించిన ఓ సన్నివేశంలో సమంత గుర్రపు స్వారి చేయాలంట. అందుకే త్రివిక్రమ్, సమంతని గుర్రపు స్వారి నేర్చుకోమని చెప్పడంతో, సమంత గుర్రపు స్వారికి సిద్ధపడింది. ఈ గుర్రపు స్వారీ శిక్షణలో అల్లు అర్జున్ కూడ సమంతకి దగ్గర ఉండి కొన్ని మెలకువలు నేర్పిస్తున్నాడంట. సమంత ఏ విధంగా గుర్రపు స్వారీ చేస్తుందో తెలియాలంటే, త్రివిక్రమ్-అల్లుఅర్జున్ ల కాంబినేషన్ ఫిల్మ్ రిలీజ్ అయితేనే సాధ్యపడుతుంది. మొత్తంగా సమంత గుర్రపు స్వారీలో అల్లుఅర్జున్ సాయపడుతున్నందుకు ఈ బ్యూటీ తెగ హ్యాపీగా ఫీలవుతుందంట.

మరింత సమాచారం తెలుసుకోండి: