టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సరికొత్త మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కుతుంది. గతంలో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు మూవీ అసలైన మల్టీస్టారర్ కాగా, ఇప్పుడు దానికి మించిన హై రేంజ్ ఓల్టేజ్ మల్టీస్టారర్ సిద్ధంగా ఉంది. అదే గోపాల గోపాల. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీతోపాటు, సాధారణ సినీ ప్రేక్షకులు సైతం తెగ ఆసక్తి ని చూపుతున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఈ మూవీపై ఒక్క పోస్టర్ కూడ బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం గోపాల గోపాల మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ ఫస్ట్ లుని రిలీజ్ చేయటానికి చిత్రయూనిట్ నిర్ణయించుకున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫస్ట్ లుక్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై క్లియర్ న్యూస్ ని మీకు అందిస్తున్నాం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ బైక్ నడుపుతూంటే వెంకటేష్ వెనక కూర్చుని ఉంటారు. పవన్ హార్లీ డేవిడ్ సన్ బైక్ మీద ఉంటారు. ఇద్దరూ ఒకే రకమైన అవుట్ ఫిట్ లో ఉంటారు. ఈ సీన్ ని సినిమాలోనూ హైలెట్ గా కనిపిస్తుందని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. ఈ సీన్ చాలా గ్రాండ్ గా ఉండటం కోసం బాగా ఖర్చు పెట్టి తీసారు. దీనికి సంబంధించిన సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం. డిసెంబర్‌లో పాటలను ఆవిష్కరిస్తాం'' అని తెలిపారు మొత్తంగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ లుక్ కోసం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెగ ఆసక్తిని చూపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: