ప్రస్తుతం కాలంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కీలకంగా మారింది. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తున్న మూవీలు బాక్సాపీస్ ని షేక్ చేస్తుండటమే కాకుండా, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిమేక్ గా మారి, బిటౌన్ బాక్సాపీస్ ని సైతం ఓ ఊపు ఊపుతుంది. దీంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటు ఇప్పుడు ఓ సరికొత్త క్రేజ్. ఇదిలా ఉంటే ఇండియన్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన తాజా సినిమా ‘లింగ’. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ చేస్తున్న బిజినెస్ ని చూస్తుంటే బిజినెస్ వర్గాలు అవాక్కవుతున్నాయి. ఎన్నడూ లేనంతగా రజనీకాంత్ నటించిన లింగా మూవీకి భారీ బిజినెస్ జరుగుతుంది. తాజాగా లింగా మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ రికార్డ్ రైట్స్ ని కైవసం చేసుకుంది. ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు 8 కోట్ల 40 లక్షల రూపాయలకు అమ్ముడయ్యాయి. మొదట 7 కోట్ల రూపాయల నుండి మొదలైన ఓవర్సీస్ మార్కెట్, తరువాత ఏకంగా 8.40 కోట్ల రూపాయలకి ఫైనల్ అయింది. ఇప్పటి వరకూ లింగా మూవీ బిజినెస్ దాదాపు 160 కోట్ల రూపాయల మార్క్ ని చేరుకుందని సమాచారం. సుమారు నాలుగేళ్ల తర్వాత రజినీకాంత్ నటిస్తున్న లైవ్ యాక్షన్ సినిమా కావడంతో, ఈ మూవీకి ఈ రేంజ్ బిజినెస్ క్రియేట్ అయిందని బిజినెస్ వర్గాలు అంటున్నాయి. పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ, డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: